ETV Bharat / bharat

JEE, NEETలో టాప్ ర్యాంకులు- కానీ AIIMS కాదని IISCలో అడ్మిషన్​- రీజన్ ఏంటంటే? - Avik Das Takes Admission In IISC - AVIK DAS TAKES ADMISSION IN IISC

Avik Das Takes Admission In IISC : ఇంజినీరింగ్, వైద్య కోర్సుల ప్రవేశ పరీక్షలు జేఈఈ, నీట్ యూజీలో జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించినా ఐఐటీ, మెడికల్ కాలేజీలో జాయిన్ కాలేదు. పరిశోధనలపై ఇష్టంతో ఇండియన్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ (IISC) బెంగళూరులో అడ్మిషన్ సాధించాడు. ఆన్​లైన్​లో కోచింగ్ తీసుకుని ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటిన అవిక్ దాక్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందామా.

JEE Advanced Topper Avik Das
NEET UG exam topper Avik Das (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 6:28 PM IST

Avik Das Takes Admission In IISC : ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు దేశంలోని టాప్ ఐఐటీల్లో సీటు సాధించాలనుకుంటారు. అలాగే వైద్య కోర్సుల కోసం నిర్వహించే నీట్ యూజీ ఎగ్జామ్​కు సన్నద్ధమయ్యేవారు మంచి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందాలనుకుంటారు. అయితే ఈ రెండు పరీక్షలకు ఒకేసారి హాజరయ్యే విద్యార్థులు కొందరు ఉంటారు. ఈ రెండు పరీక్షల్లో దేనికి మంచి ర్యాంకు వస్తే అటువైపు వెళ్లిపోతారు.

కాగా, బంగాల్​కు చెందిన ఓ విద్యార్థి జేఈఈ అడ్వాన్స్​డ్, నీట్ యూజీ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంకులు సాధించారు. అయినా ఐఐటీ, మెడికల్ కాలేజీలో చేరలేదు. పరిశోధనలపై మక్కువతో ఇండియన్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ (IISC) బెంగళూరులో అడ్మిషన్ తీసుకున్నార. ఎందుకు ఆ విద్యార్థి ఈ నిర్ణయం తీసుకున్నాడో తెలుసుకుందాం.

Avik Das
అవిక్ దాస్​ (ETV Bharat)

అంతా షెడ్యూల్ ప్రకారమే!
బంగాల్​లోని అలీపుర్‌ దువార్​​కు చెందిన అవిక్ దాస్(17) కోటాకు చెందిన అలెన్ డిజిటల్ ద్వారా ఆన్​లైన్‌ కోచింగ్ తీసుకున్నాడు. తన విజయానికి ఆన్​లైన్ కోచింగ్ కూడా ఓ కారణమని అవిక్ చెప్పుకొచ్చాడు. ప్రిపేర్ అయినప్పుడు ఏవైనా సందేహాలు ఉంటే కొన్ని గంటల్లోనే టీచర్స్​ను అడిగి పరిష్కరించుకునేవాడు. అవిక్ ఎక్కువగా చదవడానికి ఇష్టపడేవాడు. ఆన్​ లైన్ కోచింగ్ తర్వాత కాసేపు చదివి రివిజన్ చేసేవాడు. రోజంతా చదవడానికి షెడ్యూల్ వేసుకునేవాడు. అవిక్ ఆన్​లైన్​లో ప్రిపేర్ అయినా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. ఒక్కసారి సోషల్ మీడియాలోకి వెళ్లే దానికి బాసిస అవుతామని అలా దూరంగా ఉన్నాడట. సోషల్ మీడియా చదువుపై ప్రభావం చూపుతుందని అలా చేశాడట. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిద్రలేచి రాత్రి 12 గంటల వరకు చదివేవాడు.

అవిక్​ దాస్​ (ETV Bharat)

అన్నింట్లో టాపర్
"మొదటి ప్రయత్నంలోనే కష్టతరమైన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్​డ్​లో అవిక్ దాస్ 360కి 307 మార్కులు సాధించాడు. ఆల్ ఇండియా స్థాయిలో 69వ ర్యాంకు వచ్చింది. అలాగే మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీలో 720కి 705 మార్కులు సంపాదించాడు. అల్ ఇండియా స్థాయిలో దీంట్లోనూ 200 కంటే తక్కువ ర్యాంక్​ను సాధించాడు. బంగాల్ స్టేట్ బోర్డులో అవిక్ దాస్ 99.2 శాతం స్కోర్‌ తో అగ్రస్థానంలో నిలిచాడు. బంగాల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (WB-JEE)లో అవిక్ ఏడో స్థానంలో నిలిచాడు. ఇది కాకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షలో గువహటి జోన్​లో టాపర్​గా నిలిచాడు" అని అవిక్ ఆన్​లైన్ కోచింగ్ మెంటర్ గౌరవ్ శర్మ తెలిపారు.

కుటుంబ నేపథ్యం
అవిక్ దాస్ తండ్రి ప్రబీర్ కుమార్ దాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, తల్లి గృహిణి. అవిక్ తాతయ్య మ్యాథ్స్ టీచర్ కాగా, ఆయనే మొదటి గురువు. భౌతిక శాస్త్రం అంటే అవిక్ కు చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి. అవిక్ ప్రదర్శన పట్ల అతడి తండ్రి ప్రబీర్ కుమార్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. అవిక్ కష్టపడి అంకితభావంతో చదివి జేఈఈ, నీట్ యూజీలో విజయం సాధించాడని పేర్కొన్నారు. అలాగే IISC బెంగళూరు సీటును దక్కించుకున్నాడని పేర్కొన్నారు.

కుటుంబంతో కలిసి ఉండాలని ఆన్ లైన్ కోచింగ్
"నేను నా కుటుంబంతో కలిసి ఉండాలనుకున్నాను. అందుకే నేను ఈ ప్రవేశ పరీక్షలకు ఆన్​లైన్​లో కోచింగ్ తీసుకుని ఇంటి వద్దే ప్రిపేర్ అయ్యాను. నా విజయంలో టీచర్స్, సలహాదారులు, కోచింగ్ యాప్ కీలక పాత్ర పోషించాయి. నాకు అధ్యాపకులు నాణ్యమైన కంటెంట్, వ్యక్తిగత మార్గదర్శకత్వం అందించారు. ముందుగా నిర్ణయించుకుని కష్టపడి పనిచేస్తే విజయం సాధించవచ్చు. ఎన్‌సీఈఆర్​టీ మొత్తం సిలబస్​పై దృష్టి పెట్టాను. బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్ కోసం కాస్త ఎక్కువ కష్టపడ్డాను. సమయం దొరికినప్పుడల్లా పాత మోడల్ పేపర్లను తిరగేసేవాడ్ని. ఏదైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకున్నా. కోచింగ్ టెస్ట్ పేపర్లను పరిష్కరించేవాడిని. ఫిజిక్స్, మ్యాథ్స్​లోని న్యూమరికల్ అధ్యాయాలపై చాలా కష్టపడ్డాను. IISc బెంగుళూరులో ఆస్ట్రోఫిజిక్స్ విభాగంలో సీటు సంపాదించా. పరిశోధనలకు అవకాశాలు ఉంటాయని ఆ విభాగాన్ని ఎంచుకున్నా." అని అవిక్ తెలిపాడు.

కోరుకున్న ఉద్యోగం రావాలా? 'క్రిటికల్ థింకింగ్' స్కిల్ ఉండాల్సిందే! - How To Improve Critical Thinking

'దేశాన్ని అలా మార్చడమే నా లక్ష్యం'- నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో మోదీ - PM Modi at Nalanda University

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.