ETV Bharat / bharat

ఇంట్రస్టింగ్​ - కేంద్ర ప్రభుత్వ సూపర్ యాప్ - మీ ప్రాంతంలో పిడుగు పడుతుందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు! - Thunderbolts Pre Information App

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 2:44 PM IST

Updated : Jun 12, 2024, 2:50 PM IST

Thunderbolts Pre Information App : వర్షాలు పడుతున్నప్పుడు పిడుగులు పడడం సహజం. అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు పడతాయో చెప్పడం అసాధ్యం. దాంతో చాలా మంది వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే, మీ ఫోన్​లో ఈ యాప్​ ఉంటే మీ ప్రాంతంలో పిడుగు పడుతుందో లేదో ముందుగానే తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ యాప్ ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

Thunderbolts Pre Information App
DAMINI APP FOR THUNDERSTORMS (ETV Bharat)

Mobile App For Thunderbolts Pre Information : వానలు పడేటప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిసి.. ఆపై ఒక్కసారిగా పెళ్లుమనే భారీ శబ్దంతో ఉరుములు సంభవిస్తుంటాయి. అయితే, వర్షాలు కురిసేటప్పుడు ఉరుములు, మెరుపులు రావడం సహజం. కానీ, కొన్నిసార్లు వీటితో పాటు ఆకస్మాత్తుగా పిడుగులు(Thunderbolts) పడుతుంటాయి. అలా పిడుగు పడినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నవారి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే! ఎందుకంటే.. పిడుగుకున్న శక్తి అలాంటిది. నిజానికి పిడుగు ఎప్పుడు, ఎక్కడ పడుతుందో కరెక్ట్​గా చెప్పలేం. దాంతో దీని కారణంగా ఏటా ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు.

అయితే, చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. పిడుగు వంటి విపత్కర పరిస్థితుల గురించి ముందుగానే సమాచారం తెలుసుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చు! అందుకోసం మీరు చేయాల్సిందల్లా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మొబైల్​ యాప్​ను మీ ఫోన్​లో ఇన్​స్టాల్ చేసుకోవడమే అంటున్నారు నిపుణలు. అది మీ మొబైల్​లో​ ఉన్నట్లయితే అరగంట ముందుగానే మీ ప్రాంతంలో పిడుగు పడుతుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చంటున్నారు. ఇంతకీ, ఏంటి ఆ మొబైల్ యాప్? ముందుగానే సమాచారం ఎలా తెలుసుకోవచ్చు? దాన్ని ఎలా ఉపయోగించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పిడుగుల గురించి ముందుగానే హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ యాప్ పేరు.. 'Damini: Lightning Alert'. దీనిని 2020లో.. కేంద్ర భూవిజ్ఞాన శాఖ కింద పనిచేసే 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ(ఐఐటీఎం)' రూపొందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా మీరు ఉన్న ప్రదేశంలో పిడుగు పడుతుందో లేదో అరగంట ముందుగానే తెలుసుకోవచ్చు. అంటే.. మొబైల్​లో మీ జీపీఎస్ లొకేషన్ ఆధారంగా 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల గురించిన సమాచారాన్ని ఈ యాప్ ముందుగానే మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. అంతేకాదు.. ఈ యాప్ పిడుగులు పడే ప్రాంతంలో ఉన్నప్పుడు ఏవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేస్తుంది.

ఏసీలో ఎక్కువసేపు ఉంటే చాలా డేంజర్! ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసా? - Too Much AC Side Effects

ఈ యాప్​ను ఎలా యూజ్ చేయాలంటే ?

  • ముందుగా మీ మొబైల్​లో 'గూగుల్ ప్లే స్టోర్' లేదా 'యాపిల్ యాప్ స్టోర్' నుంచి 'Damini: Lightning Alert' అనే యాప్‌ను ఇన్​స్టాల్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో మీ పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్ కోడ్ వంటి వివరాలు అందించి రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం.. మీ జీపీఎస్ లోకేషన్ తెలుసుకోవడం కోసం యాప్​కు పర్మిషన్ ఇవ్వాలి.
  • ఆ విధంగా మీరు వివరాలు అందించాక యాప్​లో మీరు ఉన్న ప్రాంత చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలో ఒక సర్కిల్ కనిపిస్తోంది.
  • అలాగే మీ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి మూడు రంగులను ఐడెంటిఫికేషన్ కలర్స్​ కింద చూపిస్తుంది. వాటి ఆధారంగా ఈ యాప్ మీరు ఉన్న చోట పిడుగు పడే ఛాన్స్ ఉంటే ముందే హెచ్చరిస్తోంది.
  • రెడ్ కలర్ : మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుందట.
  • యెల్లో కలర్ : మీ ప్రాంతంలో మరో 10-15 నిమిషాల్లో పిడుగు పడే ఛాన్స్ ఉంటే యాప్​లోని సర్కిల్ పసుపు కలర్​లోకి ఛేంజ్ అవుతుందట.
  • బ్లూ కలర్ : అలాగే.. మీరూ ఉన్న చోట మరో 18-25 నిమిషాల్లో పిడుగు పడే ఛాన్స్ ఉంటే ఆ సర్కిల్ బ్లూ కలర్​లోకి మారుతుందట!

వాతావరణ విపత్తులను గుర్తించే విషయంలో భారత్​ వెనుకంజ - అసలు కారణాలు ఇవే! - India Rank Early Disaster Warning

Last Updated : Jun 12, 2024, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.