ETV Bharat / bharat

వాషింగ్​ మెషీన్​లో బట్టలు మాత్రమే కాదు - ఇవి కూడా క్లీన్​ చేయొచ్చు! - Things to Clean in Washing Machine - THINGS TO CLEAN IN WASHING MACHINE

Washing Machine: వాషింగ్‌ మెషీన్​లో బట్టలు మాత్రమే కాకుండా.. మరికొన్ని వస్తువుల్ని సైతం క్లీన్​ చేయవచ్చని అంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటి? వాటిని మెషీన్‌లో వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Washing Machine
Washing Machine (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 11:12 AM IST

Things to Clean in Washing Machine other than Clothes : ఈ రోజుల్లో వాషింగ్ మెషీన్​ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. అయితే.. వాషింగ్​ మెషీన్లో కేవలం బట్టలు మాత్రమే కాకుండా మరికొన్ని వస్తువులను సైతం ఈజీగా వాష్​ చేయవచ్చంటున్నారు నిపుణులు. మరి ఆ వస్తువులు ఏంటి? వాటిని మెషీన్​లో వేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ స్టోరీలో చూద్దాం..

వాషింగ్​ మెషీన్​లో క్లీనింగ్​ కోసం వేసే వస్తువులు:

  • పిల్లలు ఆడుకునే సాఫ్ట్‌ టాయ్స్‌, క్లాత్‌ లేదా ఫర్‌ మెటీరియల్‌తో తయారుచేసిన బొమ్మలపై త్వరగా దుమ్ము చేరి మురికిగా తయారవుతాయి. కాబట్టి ఆ బొమ్మలను మెష్‌ బ్యాగ్‌లో వేసి వాషింగ్​ మెషీన్​లో క్విక్‌ వాష్‌(Quick Wash) ఆప్షన్‌ ఎంచుకుంటే.. చిటికెలో కొత్త వాటిలా మారిపోతాయని అంటున్నారు.
  • వంటగదిలో తరచూ ఉపయోగించే స్పాంజ్‌లు, సిలికాన్‌ ట్రివెట్స్‌ (వేడి గిన్నెల అడుగున వేసే మ్యాట్‌), వేడి గిన్నెలు దింపడానికి ఉపయోగించే సిలికాన్‌ మిట్స్‌/అవెన్‌ మిట్స్‌/సిలికాన్‌ గ్లౌజులు.. వంటి వాటినీ వాషింగ్‌ మెషీన్‌లో వేసి క్లీన్​ చేసుకోవచ్చు. అయితే వీటి కోసం మరీ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీళ్లు వచ్చేలా ముందుగా మెషీన్‌లో ఆప్షన్‌ను సెట్‌ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
  • ప్రస్తుతం లూఫా స్పాంజ్‌ల వినియోగం కామనైపోయింది. వీటిని ఉపయోగించే సమయంలో చర్మంపై ఉన్న మురికి, మృతకణాలు ఇందులోకి చేరతాయి.. కాబట్టి వీటినీ తరచూ శుభ్రం చేసుకోవాల్సిందే. ఈ క్రమంలోనే వీటిని మెష్‌ బ్యాగ్‌లో ఉంచి.. మెషీన్‌లో వేయవచ్చని అంటున్నారు.
  • హెయిర్‌ టైస్‌, హెడ్‌ బ్యాండ్స్‌, రబ్బర్‌ బ్యాండ్స్‌.. వంటి హెయిర్‌ యాక్సెసరీస్‌ త్వరగా జిడ్డుగా మారిపోతాయి. వీటిని కూడా మెష్‌ బ్యాగ్‌లో వేసి వాషర్‌లో వేసేస్తే సరి.
  • ప్రస్తుతం ఏ టైప్​ ఆఫ్​ దుస్తులు వేసుకున్నా బెల్టు పెట్టుకోవడం ఫ్యాషనైపోయింది. కాబట్టి వీటిని వాష్​ చేయాలనుకున్నప్పుడు మెష్‌ బ్యాగ్‌లో వేసి మెషీన్‌లో వేసి ఆన్​చేస్తే సరి. తద్వారా వాటికి ఉండే మెటల్‌ హార్డ్‌వేర్‌ పాడవకుండా ఉంటుంది.

వాషింగ్ మెషిన్ క్లీనింగ్ కోసం బెస్ట్ టిప్స్ - ఫాలో అయ్యారంటే నిమిషాల్లో తళతళ మెరిసిపోవడం పక్కా! - Washing Machine Cleaning Tips

మెషీన్​లో వస్తువులు వేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

  • కాస్త గట్టి వస్తువులు, సున్నితమైన వస్తువుల్ని జిప్‌లాక్‌ ఉన్న మెష్‌ బ్యాగ్‌లో వేసి వాషింగ్​ మెషీన్​లో వేయాలి. తద్వారా అటు వస్తువలు, ఇటు వాషింగ్‌ మెషీన్‌ డ్యామేజ్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు.
  • చాలా వరకు చల్లటి లేదా గోరువెచ్చటి నీటిని ఉపయోగించడమే మంచిది. అలాగే ‘క్విక్‌ వాష్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే వస్తువుల నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.
  • అన్ని వస్తువులకు గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్‌/లిక్విడ్‌ ఉపయోగించడం బెస్ట్​. మరీ సున్నితంగా ఉన్న వస్తువులైతే క్యాస్టైల్‌ సోప్‌ లిక్విడ్‌ని వాడచ్చు.
  • కొన్ని వస్తువుల నుంచి దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు వాష్‌ సైకిల్‌లో అరకప్పు వైట్‌ వెనిగర్‌ వేస్తే ప్రాబ్లమ్​ సాల్వ్​.
  • క్లీన్​ అయిన తర్వాత వీటన్నింటినీ ఎండలో ఆరబెట్టడం వల్ల వాటిలోని బ్యాక్టీరియా, ఇతర క్రిములు తొలగిపోయి మరింత శుభ్రపడతాయి.
  • వీటన్నింటితో పాటు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆయా వస్తువుల్ని మెషీన్​లో వేసే ముందు వాటి లేబుల్స్​ను గమనించడం మంచిది.
  • అలాగే మెషీన్​లో ఆయా వస్తువులు శుభ్రం చేసే ఫీచర్లు ఉన్నాయో, లేదో ముందే చూసుకోవడం మర్చిపోవద్దు. తద్వారా ఆయా వస్తువులు, వాషర్‌.. రెండూ పాడవకుండా జాగ్రత్తపడచ్చు.

వాషింగ్ మెషిన్లో ఎన్ని దుస్తులు వేస్తున్నారు? - ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం! - Washing Machine Maintenance Tips

బైక్​ వాషింగ్​కు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతోందా? ఈ టిప్స్​ పాటిస్తే మనీ సేవ్​! - bike washing tips

దుస్తుల లైఫ్‌ను పెంచే ట్రిక్​- వాషింగ్​ మెషీన్​లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.