How To Make Rava Kesari Recipe : స్వీట్లు ఎన్ని రకాలు ఉన్నా.. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే హల్వా ప్రత్యేకతే వేరు. దీన్ని ఎంత తిన్నా.. మరి కొంచెం కావాలంటారు స్వీట్ లవర్స్. ఈ నోరూరించే స్వీట్ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే.. ఇందులో రకరకాలు ఉన్నప్పటికీ 'సూజీ(రవ్వ) కా హల్వా' టేస్టే వేరు అని చెప్పుకోవచ్చు. దీన్నే 'రవ్వ కేసరి' అని కూడా పిలుస్తారు. పండగలు, శుభకార్యాల టైమ్లో ఈ స్వీట్ రెసిపీ క్రేజ్ మామూలుగా ఉండదు.
అయితే.. చాలా మంది ఈ రెసిపీని ట్రై చేస్తుంటారు కానీ, సరైన టేస్ట్ రాదు. అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే విధంగా పక్కా కొలతలతో సూజీ హల్వా(Halwa) ట్రై చేశారంటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- 1 1/2 కప్పు - సూజీ(రవ్వ)
- 3 టేబుల్ స్పూన్లు - నెయ్యి
- 1/2 కప్పు - పాలు
- 2 1/2 కప్పు - నీరు
- 3/4 కప్పు - బెల్లం
- 3-4 - కుంకుమ పువ్వు
- 3 టీస్పూన్స్ - ఎండు ద్రాక్ష
- 3 టీస్పూన్స్ - జీడిపప్పు
- 3 టీస్పూన్స్ - బాదం
- 1 టీస్పూన్ - సోంపు
సూజీ హల్వా తయారీ విధానం :
- ముందుగా స్టౌ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులో నెయ్యి వేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో సోంపు గింజలు వేసి అవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి.
- ఇప్పుడు అందులో రవ్వ వేసుకొని అది గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి.
- ఆ తర్వాత అదే పాన్లో బెల్లం, వాటర్ వేసి కరిగించుకోవాలి. అంటే.. బెల్లం-నీళ్ల మిశ్రమం చిక్కబడేలా కొంతసేపు దాన్ని ఉడికించుకోవాలి. తక్కువ మంట మీద సుమారు 3 నుంచి 4 నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని ఉడకనివ్వాలి.
- ఇప్పుడు ఆ మిశ్రమంలో పాలు, కుంకుమపువ్వు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై వేయించి పక్కన పెట్టుకున్న సూజీ(రవ్వ) వేసి ఉడికించుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమం చిక్కగా మారడం ప్రారంభించిన తర్వాత.. జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షను కాస్త ఫ్రై చేసుకొని అందులో వేసుకోవాలి.
- ఆపై మొత్తం మిశ్రమాన్ని మరో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే.. నోరూరించే రుచికరమైన సూజీ హల్వా రెడీ!
- దీన్ని వేడివేడిగా తిన్నా లేదా చల్లారిన తర్వాత తిన్నా కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది.
- మరి, ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ టేస్టీ సూజీ హల్వా రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి!
ఇంట్లోనే ఈజీగా "మీఠా సమోసా" - టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! - How to Prepare Meetha Samosa