Sri Krishna Idol In Uttar Pradesh : దేవుడు కలలోకి వచ్చి ఓ చోట తన విగ్రహం ఉందని బయటకు తీయండి అని చెప్పేవాడని చాలా కథల్లో వినే ఉంటాం. అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఓ బాలికకు కృష్ణుడు కలలో కనిపించి విగ్రహం గురించి చెప్పాడం వల్ల తవ్వకాలు జరిపించారు స్థానికులు. తీరా చూస్తే ఆ స్థలంలో శ్రీ కృష్ణుడి విగ్రహం బయట పడింది. దీంతో పక్కనే ఉన్న గుడిలో ప్రతిష్ఠించి, దేవుడితో పాటు బాలికకు పూజలు చేస్తున్నారు గ్రామస్థులు. ఆ విగ్రహన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.
నెలరోజులగా కలలోకి వస్తున్న శ్రీకృష్ణుడు
షాజహాన్పుర్ జిల్లా సఫోరా గ్రామానికి చెందిన వినోద్ తన కుటుంబంతో పిలిభిత్ జిల్లాలో నివసిస్తున్నారు. తన కూతురు పూజా ఠాకుర్ ఎనిమిదో తరగతి చదువుతోంది. అయితే పూజకు ఏడాది కాలంగా శ్రీకృష్ణుడు కలలోకి వస్తున్నాడని చెప్పింది. అయితే నెల రోజులు నుంచి సఫోరా గ్రామంలో తన విగ్రహం ఉందని శ్రీ కృష్ణుడు కలలో చెప్పాడని తల్లిదండ్రలకు చెప్పింది. దీంతో వాళ్లు పూజ చెప్పిన స్థలంలో స్థానికులు సాయంతో తవ్వకాలు జరిపించారు. కేవలం మూడు అడుగుల లోతులోనే కృష్ణుడి విగ్రహం బయటపడింది. ఆ పత్రిమ అడుగు ఎత్తు ఉండగా, కిలోగ్రాము బరువు ఉంది. దీంతో స్థానికులు అందరూ పక్కనే ఉన్న బాబా బ్రహ్మదేవ్ గుడిలో ప్రతిష్ఠంచి పూజాలు చేయటం ప్రారంభించారు. కృష్ణుడితో పాటు బాలికకు పూజలు చేస్తున్నారు.
సరదాగా తీసుకున్న తల్లిదండ్రులు
గతేడాది కాలంగా శ్రీకృష్ణుడు తన కలలోకి వస్తున్నాడని అదే విషయాన్ని తల్లిదండ్రలకు చెప్పినప్పుడు వాళ్ల నమ్మలేదని పూజా ఠాకుర్ అంటుంది. 'ఓ రోజు శ్రీకృష్ణుడు కనిపించి సఫోరా గ్రామంలోని పురాతన ప్రదేశంలో ఒక విగ్రహాన్ని పూడ్చిపెట్టినట్లు చెప్పాడు. అదే విషయాన్ని మా అమ్మా నాన్నలకు చెప్పాను. కానీ వారు నమ్మలేదు. అదే కల తరుచూగా రావడం వల్ల తల్లిదండ్రులను తీసుకొని ఆ గ్రామానికి వెళ్లాను. తవ్వకాలు జరపగా విగ్రహం బయటపడింది. నాకు కృష్ణుడిపై అపారమైన నమ్మకం ఉంది' అని పూజా తెలిపింది.
'ఐదేళ్ల బాలరాముడు ఒత్తిడి తట్టుకోలేరు- అందుకే దర్శనానికి రోజూ గంట బ్రేక్'
కూతురికి నివాళిగా స్కూల్లో 'భరతమాత' విగ్రహం- ఆ రెండు రోజులు అక్కడే గడుపుతున్న తండ్రి!