ETV Bharat / bharat

'అతి విశ్వాసం వద్దు, మనవైపే ప్రజల మొగ్గు'- కలిసికట్టుగా పోరాడాలని సోనియా పిలుపు - Sonia Gandhi On Modi - SONIA GANDHI ON MODI

Sonia Gandhi On Union Budget : కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. అలా అని అతివిశ్వాసంతో ఉండొద్దని పార్టీ నాయకులకు సూచించారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో కలిసికట్టుగా పోరాడాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా విమర్శలు గుప్పించారు.

Sonia Gandhi On Union Budget
Sonia Gandhi On Union Budget (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 12:27 PM IST

Sonia Gandhi On Union Budget : కాంగ్రెస్​కు అనుకూలంగా ప్రజలు మొగ్గు చూపుతున్నారని, అలా అతి విశ్వాసంతో ఉండొద్దని పార్టీ నేతలకు అగ్రనాయకురాలు సోనియా గాంధీ సూచించారు. లోక్​సభ ఎన్నికల మాదిరిగానే త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ పోరులో కూడా అదే ఊపును కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎదురుదెబ్బ తర్వాత మోదీ సర్కార్ పాఠాలు నేర్చుకుంటుందని అనుకున్నామని అన్నారు. కానీ ఇప్పటికీ వారు సమాజాన్ని వర్గాలవారీగా విభజించి భయం, శత్రుత్వ వాతావరణాన్ని వ్యాప్తి చేసే విధానానికి కట్టుబడి ఉన్నారని సోనియా గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.

"మనం ఆత్మసంతృప్తి చెందకూడదు. అలాగే అతి ఆత్మవిశ్వాసంతో ఉండకూడదు. లోక్​సభ ఎన్నికల్లో చూపిన తెగువను చూపించి పోరాడితే జాతీయ రాజకీయాల్లో మార్పులు తీసుకురాగలం. కావడి యాత్ర మార్గంలో హోటళ్ల ముందు యజమానుల పేర్లతో బోర్డులు పెట్టాలంటూ ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులపై అదృష్టవశాత్తూ సరైన సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్టే విధించింది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాలుపంచుకునేలా నిబంధనలను ఎన్​డీఏ సర్కార్ అకస్మాత్తుగా ఎలా మార్చిందో చూడండి. ఆర్ఎస్ఎస్ తనను తాను సాంస్కృతిక సంస్థగా అభివర్ణించుకుంటుంది. అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయ సైద్ధాంతిక పునాదని ప్రపంచమంతా తెలుసు. లోక్​సభ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఊపును, సానుకూలతను కొనసాగించాలి. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలి"

-సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్

'రైతులు, యువత డిమాండ్లను విస్మరించారు'
ముఖ్యంగా రైతులు, యువత డిమాండ్లను కేంద్ర బడ్జెట్​లో పూర్తిగా విస్మరించారని ఎన్​డీఏ సర్కార్​పై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. కీలకమైన అనేక రంగాలకు బడ్జెట్​లో కేటాయింపులు లేవని విమర్శించారు. 2021లో జరగాల్సిన జనాభా గణనను నిర్వహించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. "ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తారు. కానీ అల్లర్లతో అతలాకుతలమైన మణిపుర్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. మణిపుర్​లో పరిస్థితులు ఇప్పటికీ కుదుటపడలేదు. దేశ భద్రత విషయంలో తీవ్ర కలవరపాటుకు గురిచేసే వార్తలు వస్తున్నాయి. వారాల వ్యవధిలోనే జమ్ము ప్రాంతంలో 11 ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఉగ్రదాడుల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు" అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.

పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా దేశం పరిస్థితి : రాహుల్ గాంధీ - parliament budget session 2024

మాట నిలబెట్టుకున్న రాహుల్​ గాంధీ- చెప్పులు కుట్టే వ్యక్తికి కుట్టు మెషీన్​ సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.