ETV Bharat / bharat

రెడ్​ సిగ్నల్​ పడినా ఆపకుండా కి.మీ దూసుకెళ్లిన రైలు- కరెంట్​ కట్​ చేసి స్టాప్​!

Shiv Ganga Express Accident Today : రెడ్​ సిగ్నల్​ పడినా, పట్టించుకోకుండా సుమారు కిలోమీటర్​ ముందుకు వెళ్లింది ఓ రైలు. సమాచారం అందుకున్న అధికారులు విద్యుత్​ సరఫరాను నిలిపివేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

train accident today
train accident today
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 5:29 PM IST

Updated : Feb 1, 2024, 6:09 PM IST

Shiv Ganga Express Accident Today : ఉత్తర్​ప్రదేశ్​ ఇటవా జిల్లాలో రెడ్​ సిగ్నల్​ పడినా, పట్టించుకోకుండా సుమారు కిలోమీటర్​ ముందుకు వెళ్లింది శివగంగ ఎక్స్​ప్రెస్​. ఈ సమయంలో అదే లైన్​లో మరో రైలు ఉంది. రెడ్​ సిగ్నల్​ పడినా రైలు రావడాన్ని గమనించిన అధికారులు విద్యుత్​ సరఫరాను నిలిపివేశారు. దీంతో రైలులోని ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై వెంటనే దర్యాప్తునకు ఆదేశించినట్లు ఉత్తర మధ్య రైల్వే పీఆర్​ఓ అమిత్​ సింగ్​ తెలిపారు. తప్పు చేసినట్లు తేలితే ఇద్దరు లోకోపైలట్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ జరిగింది
దిల్లీ-హావ్​డా రూట్​లోని భర్థనా స్టేషన్​కు ఐదు కిలోమీటర్ల ముందు 507 నంబర్​ వద్ద రెడ్​ సిగ్నల్ వేశారు అధికారులు. ఈ సమయంలో రైలు సుమారు 80కిలోమీటర్లు వేగంతో వస్తుంది. అయితే, ఈ రెడ్​ సిగ్నల్​ను పట్టించుకోని లోకోపైలట్లు సుమారు కిలోమీటర్​ మేర ముందుకు పోనిచ్చారు. స్టేషన్​లో హమ్​సఫర్​ ఎక్స్​ప్రెస్​ రైలు ఉండడాన్ని గమనించిన అధికారులు, వెంటనే శివగంగ ఎక్స్​ప్రెస్​కు విద్యుత్​ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను రైలు ప్రమాదం తప్పినట్లైంది. వెంటనే వైశాలి ఎక్స్​ప్రెస్​లో మరో ఇద్దరు లోకోపైలట్లను పంపించారు. దీంతో సుమారు 25 నిమిషాల అనంతరం రైలు బయలుదేరింది. ఇద్దరు లోకోపైలట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరికి వైద్య పరీక్షలు సైతం చేశారు.

"కాన్పూర్​ నుంచి దిల్లీ వరకు ఆటోమెటిక్ సిగ్నల్​ వ్యవస్థ ఉంది. ఇది చాలా పటిష్ఠంగా ఉంటుంది. దీంట్లో వైఫల్యాలకు తావు ఉండదు. అయితే ఉదయం కావడం వల్ల తేమతో సిగ్నల్​ కనిపించకోపోయే అవకాశం ఉంది. అలాగే లోకోపైలట్లు నిద్రపోతున్నారా? మద్య సేవిస్తున్నారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం."

--రైల్వే అధికారులు

పట్టాలు తప్పిన రైలు
కొన్ని నెలల కింద కూడా ఉత్తర్​ప్రదేశ్​లోనే రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రయాగ్​రాజ్​ రైల్వే స్టేషన్​ సమీపంలో సుహైల్‌దేవ్​ సూపర్​ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఘాజీపుర్​ నుంచి దిల్లీలోని ఆనంద్​ విహార్ టెర్మినల్​​కు వెళ్తున్న సుహైల్‌దేవ్​ సూపర్​ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్​ సహా మరో రెండు కోచ్​లు పట్టాలు తప్పాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Last Updated : Feb 1, 2024, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.