ETV Bharat / bharat

నీట్​ పేపర్​ లీక్​ నిజమే- అలా జరిగితే రీ-టెస్ట్​ తప్పనిసరి : సుప్రీం కీలక వ్యాఖ్యలు - NEET UG Supreme Court Hearing - NEET UG SUPREME COURT HEARING

SC Confirms NEET UG 2024 Paper Leak : నీట్​ యూజీ 2024 ప్రశ్నాపత్రం లీక్​ కావడం వాస్తవమే అని సుప్రీంకోర్టు తేల్చింది. తాము దోషులను గుర్తించలేకపోయినా, పరీక్ష విశ్వసనీయత కోల్పోయినా, ప్రశ్నాపత్రం సోషల్ మీడియా ద్వారా లీక్​ అయినా రీ-టెస్ట్​కు ఆదేశించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎంతమంది విద్యార్థుల ఫలితాలు నిలిపివేశారు? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని తేల్చి చెప్పింది.

SC Confirms NEET UG 2024 Paper Leak
SC Confirms NEET UG 2024 Paper Leak (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 4:04 PM IST

SC Confirms NEET UG 2024 Paper Leak : వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌ - యూజీ 2024పై సుప్రీం కోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రశ్న పత్రం లీక్​ అవడం వాస్తవమే అని తేల్చింది. తాము దోషులను గుర్తించలేకపోయినా, పరీక్ష విశ్వసనీయత కోల్పోయినా, పరీక్షా పత్రం సోషల్ మీడియా ద్వారా లీక్​ అయినా రీ-టెస్ట్​కు ఆదేశించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లీకేజీ లబ్ధిదారులు ఎంతమంది? వారిని గుర్తించారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంపై వాదనలు విన్న భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రతో కూడిన ధర్మాసనం, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

"67మంది అభ్యర్థులు 720/720 మార్కులు స్కోర్​ చేశారు. గతంలో ఈ నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. లీక్​ జరగలేదనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు. ఏ మేరకు లీక్​ జరిగిందో తాము నిర్ణయిస్తాము. ఈ వ్యవహారంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఈ లీక్​ ద్వారా ప్రయోజనం పొందిన వారి సంఖ్య, అందులో ఎంతమంది ఫలితాలను నిలిపివేశారు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం పరీక్షను రద్దు చేయలేకపోతే, లీకేజీ ద్వారా ప్రయోజనం పొందినవారిని గుర్తించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? పేపర్ లీక్‌ అనేది 23 లక్షల మందితో ముడిపడిన అంశం. జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తాం." అని అత్యున్నత ధర్మాసనం వివరించింది.

నీట్​ ప్రశ్నపత్రం లీక్​ అయిందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, నీట్ పరీక్షను రద్దు చేయకుండా నేషనల్​ టెస్టింగ్ ఏజెన్సీని (ఎన్​టీఏ) నిరోధించాలని కోరుతూ గుజరాత్​కు చెందిన 50మందికి పైగా అభ్యర్థులు పిటిషన్​ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్లపై సుప్రీకోర్టు విచారణ చేపట్టింది.

ఇదీ కేసు
ఈ ఏడాది నీట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్​ మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ వచ్చింది. పరీక్ష పేపర్‌ లీక్‌ కావడం సహా పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అనుమానాలు వచ్చాయి. ఇంత మంది టాప్‌ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ మార్కులు కారణమని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాలతో కేంద్రం 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్‌ మార్కులను రద్దు చేసింది. అనంతరం రీ-టెస్ట్ లేదా ​గ్రేస్​ మార్కులు వదులుకోవాలని నీట్​ అభ్యర్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చింది కేంద్రం. ఆ తర్వాత జూన్​ 23న రీ-టెస్ట్​ నిర్వహించి జులై 1న సవరించిన మార్కుల లిస్ట్​ను ప్రకటించింది ఎన్​టీఏ.

సీబీఐ దర్యాప్తు
నీట్​ పేపర్​ లీక్​పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. నీట్ యూజీ పరీక్ష లీకేజీపై పూర్తిస్థాయి విచారణ కోసమే సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. మరోవైపు ఈ కేసులో మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14మందిని ఇప్పటికే బిహార్​ పోలీసులు అరెస్ట్ చేశారు.

నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ వాయిదా- తదుపరి నోటీసులో క్లారిటీ!

'నీట్‌ పరీక్షను రద్దు చేయడం కరెక్ట్​ కాదు- లక్షల మంది​ నష్టపోతారు'- సుప్రీంకు కేంద్రం అఫిడవిట్ - Centre files affidavit before SC

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.