ETV Bharat / bharat

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- ట్రాలీ ఢీకొని 9మంది మృతి - Road Accident In Rajasthan - ROAD ACCIDENT IN RAJASTHAN

Road Accident In Rajasthan : రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి వ్యాన్​ను ఓ ట్రాలీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

Road Accident In Rajasthan
Road Accident In Rajasthan
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 7:29 AM IST

Updated : Apr 21, 2024, 8:20 AM IST

Road Accident In Rajasthan : రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఓ ట్రాలీ అదుపు తప్పి వ్యాన్​ను ఢీ కొట్టిన ఘటనలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున ఝలావర్​ జిల్లాలోని అకలేరాలో జరిగింది. మధ్యప్రదేశ్​లో ఓ వివాహ వేడకకు హాజరయ్యే తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అకలేరా సమీపంలోని దుంగార్ గ్రామాని చెందిన వారని పోలీసులు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన కొంతమంది తమ బంధువు వివాహ వేడుక కోసం శనివారం మధ్యప్రదేశ్​కు వెళ్లారని, తిరిగి వస్తుండగా ట్రాలీ ఢీ కొట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రమాదం గురించి కుటుంబ సభ్యలకు సమాచారం అందించామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం మృతదేహాలను అకలేరా ఆస్పత్రిలో ఉంచినట్లు తెలిపారు.

ముగ్గురు వ్యక్తులపై దూసుకెళ్లిన లారీ
Uttar Pradesh Road Accident : ఉత్తర్​పద్రేశ్​లోని సోన్​భద్ర జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

మైన్​పురి జిల్లాలోని ఎటా ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు ఆదివారం జరిగే వివాహా వేడకకు హజరయ్యేందుకు వెళ్లారు. అయితే శనివారం రాత్రి 8గంటల సమయంలో వాకింగ్​కు బయటకు వెళ్లారు. చరకా టోలా సమీపంలో ముందు నుంచి వేగంగా వస్తున్న ఓ లారీ ఈ ముగ్గురిని ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరంతా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్​ కోసం గాలిస్తున్నామని అన్నారు.

కారు, బస్సు ఢీ- ఐదుగురు దుర్మరణం
ఇటీవలే మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బస్సు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. మరో 11మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి- పోలింగ్ జరిగిన తర్వాత రోజే- మోదీ సంతాపం - Lok Sabha Election 2024

తొలి గెలుపు కోసం అలుపెరుగని పోరాటం- 14వసారి బరిలోకి పోపట్​లాల్​- ఆస్తులు అమ్మి మరీ! - lok sabha elections 2024

Last Updated : Apr 21, 2024, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.