ETV Bharat / bharat

సమ్మర్‌లో జీర్ణ సమస్యలు వేధిస్తున్నాయా? సత్తుపిండితో ఈ రెసిపీలు ట్రై చేయండి! - Recipes With Sattu Atta

Recipes With Sattu Pindi : దాదాపు మన అందరి ఇళ్లలో సత్తుపిండి తప్పకుండా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా సత్తుపిండిని తింటారు. అయితే, ఈ సమ్మర్‌లో సత్తుపిండితో వివిధ రకాల వంటలు ప్రిపేర్‌ చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి సత్తుపిండితో ఏ రెసిపీలు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Recipes With Sattu Atta
Recipes With Sattu Atta
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 1:27 PM IST

Recipes With Sattu Pindi : ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. అయితే, సమ్మర్‌లో మనం ఎన్ని వాటర్ తాగినా కూడా బాడీ డీహైడ్రేట్‌ అవుతూనే ఉంటుంది. అలాగే కొన్నిసార్లు వాటర్‌ ఎక్కువ తాగడం వల్ల ఆహారం ఏమి తినాలని అనిపించదు. ఇలాంటి వారు ఈ ఎండాకాలంలో సత్తుపిండితో కొన్ని రెసిపీలు ప్రిపేర్‌ చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులంటున్నారు. సత్తుపిండితో చేసిన వంటకాలను తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని తెలియజేస్తున్నారు. మరి ఇంతకీ సత్తుపిండితో ఎటువంటి వంటకాలు ట్రై చేయాలో ఇప్పుడు చూద్దాం.

సత్తు పరోటా :

కావాల్సిన పదార్థాలు :

  • సత్తు పిండి - 100 గ్రాములు
  • ఆయిల్‌- 2 టేబుల్‌ స్పూన్‌
  • ఉల్లిపాయ - 1
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • జీలకర్ర- అర టీస్పూను
  • ఉప్పు- సరిపడినంత
  • మిరియాల పొడి - 1 టీ స్పూన్​
  • గోధుమ పిండి - రెండు గ్లాసులు

సత్తు పరోటా తయారు చేయు విధానం :

  • ముందుగా పరోటాలలోకి స్టఫ్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. అందుకోసం సత్తుపిండిలో కట్‌ చేసిన వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్‌, వాటర్‌ యాడ్‌ చేసుకుని మెత్తగా కలుపుకోవాలి.
  • తర్వాత గోధుమ పిండిని తీసుకుని చపాతీల పిండిలా మెత్తగా కలుపుకోవాలి.
  • పిండిని ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక ఉండ తీసుకుని కొద్దిగా పల్చగా ఒత్తుకుని అందులోకి ముందే రెడీ చేసుకున్న స్టఫ్​ పెట్టుకుని క్లోజ్​ చేసుకోవాలి. తర్వాత వాటిని పరోటాలుగా చేసుకోవాలి. మిగిలిన ఉండలను కూడా ఇలానే చేసుకోవాలి.
  • ఈ పరోటాలను వేడివేడి పెనం మీద ఆయిల్‌ లేదా నెయ్యి వేసుకుని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.
  • అంతే ఇలా సింపుల్‌గా సత్తు పరోటాను ప్రిపేర్‌ చేసుకోవచ్చు.

చలవనిచ్చే 'చాస్'.. తయారు చేయండి ఇలా..

సత్తుపిండి దోశ :

  • సత్తుపిండి - 6 టేబుల్‌ స్పూన్లు
  • శనగ పిండి - 4 టేబుల్‌ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడ
  • మిరియాల పొడి - 1 టీ స్పూన్​
  • పసుపు చిటికెడు
  • ఉల్లిపాయ - 1
  • వెల్లుల్లి - 5
  • నిమ్మరసం - కొద్దిగా
  • పెరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు

సత్తు పిండి దోశ రెడీ చేయు విధానం :

  • ముందుగా సత్తుపిండిలో శనగ పిండి, పసుపు, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు, పెరుగు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఇందులోకి కొద్దిగా వాటర్‌ యాడ్‌ చేసుకుని దోశల పిండిలా చేసుకోవాలి.
  • తర్వాత నాన్‌స్టిక్‌ పానంపై కొద్దిగా ఆయిల్‌ వేసి దోశలాగా పిండిని వేసుకుని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.
  • అంతే ఇలా ఎంతో ఈజీగా సత్తుపిండితో దోశలను తయారు చేసుకోవచ్చు.
  • ఒక్కసారి బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ దోశ ట్రై చేశారంటే, ఒకటికి రెండు తినడం గ్యారంటీ. అంత గొప్ప టేస్ట్‌ ఉంటుంది ఈ దోశ.

Note: ఇక్కడ సత్తుపిండి కోసం పుట్నాలు వాడుకున్నాము. అంటే పుట్నాలను దోరగా వేయించి పొడి చేసుకుంటే సత్తుపిండి రెడీ అవుతుంది. మీరు సత్తుపిండిని బియ్యం, నువ్వులు, గోధుమలతో కూడా చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు.

పుట్నాల పప్పు: పుట్నాల పప్పులో ప్రోటీన్​, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ప్రోటీన్ జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇవి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి.

పుట్టగొడుగులతో నోరూరించే వంటలు

'పొటాటో లాలిపాప్స్' సింపుల్​గా చేసేద్దామిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.