Best Ramadan Recipes For Iftar in Telugu : దేశవ్యాప్తంగా ముస్లింలకు పవిత్రమైన రంజాన్(Ramadan 2024) మాసం నడుస్తోంది. రోజంతా ఉపవాసం ఉన్నవారు.. సాయంత్రం వేళ బలవర్థకమైన పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే వారికోసం రెండు స్పెషల్ ఇఫ్తార్ రెసిపీలు తీసుకొచ్చాం. అందులో ఒకటి చిక్‌పీస్ స్టఫ్డ్ బెల్ పెప్పర్ రెసిపీ, మరొకటి ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ. వీటిని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిక్‌పీస్ స్టఫ్డ్ బెల్ పెప్పర్ తయారీకి కావలసిన పదార్థాలు :
- బెల్ పెప్పర్ - పెద్దది ఒకటి
- 100 గ్రాములు - ఉడికించిన చిక్‌పీస్
- 1/4 కప్పు - వండిన క్వినోవా
- 1/4 కప్పు - తరిగిన టమోటాలు
- 1/4 కప్పు - పాలకూర(సన్నగా కట్ చేసినది)
- 2 టేబుల్ స్పూన్లు - ఫెటా చీజ్
- 1 టేబుల్ స్పూన్ - సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
- రుచికి సరిపడా - ఉప్పు, మిరియాలు
- జీలకర్ర - కొద్దిగా
- 1/2 టేబుల్ స్పూన్ - ఆలివ్ నూనె
* ఈ చిక్ పీస్ స్టఫ్డ్ బెల్ పెప్పర్ తోపాటుగా కీరదోస పెరుగు సలాడ్ కూడా తయారు చేసుకోవాలి. ఇవి రెండూ కలిపి తినాల్సి ఉంటుంది.
కీరదోస పెరుగు సలాడ్ కోసం కావాల్సినవి :
- కొన్ని కట్ చేసిన కీరదోస ముక్కలు
- 1/2 కప్పు - గ్రీకు పెరుగు
- 1/2 టేబుల్ స్పూన్ - మెంతుల పొడి
- 1/4 టేబుల్ స్పూన్ - లవంగం, వెల్లుల్లి ముక్కలు
- కాస్త నిమ్మకాయ రసం
- రుచికి సరిపడా ఉప్పు, మిరియాలు
- 1/2 టేబుల్ స్పూన్ - ఆలివ్ నూనె
తయారీ విధానం :
- ఇప్పుడు ముందుగా బెల్ పెప్పర్‌ను తీసుకొని సగానికి కట్ చేసి అందులోని విత్తనాలు, పొరలను తొలగించి పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత చిక్‌పీస్, స్టఫ్డ్ బెల్ పెప్పర్ కోసం.. పైన చెప్పిన పదార్థాలన్నింటినr ఒక గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమాన్ని.. కట్ చేసి పక్కన పెట్టుకున్న బెల్ పెప్పర్లో సగానికి ఒత్తి నింపి పోయిల్ కవర్‌తో కప్పి వాటిని 25- 30 నిమిషాల పాటు ఓవెన్లో 180సెంటీగ్రేడ్ వద్ద బేక్ చేయాలి.
- ఆ తర్వాత పోయిల్ కవర్ తీసేసి మరొక 10-15 నిమిషాలపాటు బేకింగ్ కొనసాగించాలి.
- ఈలోపు కీరదోస పెరుగు సలాడ్ ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇందుకోసం ఒక కీరదోసను తీసుకొని సన్నగా ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో పెరుగుతో పాటు సలాడ్ కోసం చెప్పిన పదార్థాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో కట్ చేసిన కీరదోస ముక్కలను వేసి నెమ్మదిగా కలిపి వాటిని ఒక 30 నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి.
- అనంతరం బేకింగ్ చేసుకున్న చిక్‌పీస్ బెల్ పెప్పర్‌ను కొత్తమీరతో గార్నిష్ చేసుకొని.. ఫ్రిజ్ నుంచి కీరదోస పెరుగు సలాడ్ తీసి దానితో కలిపి సర్వ్ చేసుకోవాలి.
- అంతే.. హెల్తీ ఇఫ్తార్ రెసిపీ సిద్ధం!
నోరూరించే హైదరాబాదీ హలీమ్ - ఇంటి వద్దే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!
ఓవర్ నైట్ ఓట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు :
- రోల్డ్ ఓట్స్ - 1/2 కప్పు
- పాలు -1/2 కప్పు
- పెరుగు/గ్రీక్ యోగర్ట్ - 1/2 కప్పు
- చియా సీడ్స్ - 1 టేబుల్ స్పూన్
- తేనె - 1 టేబుల్ స్పూన్
- ఎండు ద్రాక్ష - 1 టేబుల్ స్పూన్
- వాల్‌నట్స్ - 1 టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క పొడి - కొద్దిగా
- క్యారట్ తురుము - 1/2 కప్పు (అర కప్పు)
ఓవర్ నైట్ ఓట్స్ తయారీ విధానం :
- ముందుగా ఒక మేసన్ గ్లాస్ జార్ (గాలి చొరబడని కంటైనర్)లో రోల్డ్ ఓట్స్, చియా సీడ్స్ వేసుకోవాలి.
- అందులోనే పాలు, పెరుగు, తేనె, దాల్చిన చెక్క పొడి వేసి, తురిమిన క్యారట్ కూడా వేసి ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత జార్ మూత పెట్టి రాత్రంతా లేదా కనీసం 4 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి.
- అనంతరం ఫ్రిజ్ నుంచి ఆ జార్ తీసి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత ఎండు ద్రాక్ష, బెర్రీలు, వాల్‌నట్స్, తాజా పండ్లతో గార్నిష్ చేసుకోవాలి.
- అంతే.. ఎంతో టేస్టీ, హెల్తీ ఇఫ్తార్ రెసిపీ రెడీ..!
రంజాన్ స్పెషల్ ఫుడ్స్ ట్రై చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్‌లో ఫేమస్ హోటల్స్ ఇవే !