Jammu Kashmir Election 2024 : జమ్ముకశ్మీర్‌లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కృషిచేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. జమ్ములోని రాంబన్ జిల్లా బనిహాల్‌లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను బీజేపీ లాగేసుకుందని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న రాహుల్, ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచుతామని తెలిపారు. ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరిస్తామన్న ఆయన పాలనలో మిత్రపక్షాలను కలుపుకుని ముందుకుసాగుతామని పేర్కొన్నారు.
#WATCH | Ramban | J&K Assembly elections: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says " the alliance government of congress party is going to come to power here, this is going to happen. our first task will be to fill all the government vacancies and we will extend the age to… pic.twitter.com/jCBbjneUw4
— ANI (@ANI) September 4, 2024
''అధికారంలోకి వచ్చాక జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు మొదటి అడుగు వేస్తాం. ఎన్నికలకు ముందే మీకు రాష్ట్ర హోదా రావాలని మేం కోరుకున్నాం. రాష్ట్ర హోదా వచ్చిన తర్వాత ఎన్నికలు జరగాలని భావించాం. కానీ బీజేపీ అలా అనుకోవడం లేదు. మొదట ఎన్నికలు, తర్వాత రాష్ట్ర హోదా అంశం ఆలోచిద్దాం అని బీజేపీ అనుకుంటోంది. ఏదీ ఏమైనా సరే జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను మేం సాధిస్తాం. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందేనని ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది.'' అని రాహుల్ గాంధీ అన్నారు.
'మేము ఇద్దరు - మా ఇద్దరు'
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీలో విశ్వాసం సన్నగిల్లిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటుగా వారి కార్పొరేట్ మిత్రులు నడుపుతున్నారని ఆరోపించారు. మోదీ కార్పొరేట్ మిత్రులైన అదానీ, అంబానీల పేర్లును లోక్ సభలో వాడకూడదని అన్నారని గుర్తుచేశారు. అందుకని వారిని A1 - A2 పేర్లతో సంభోదించినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం 'మేము ఇద్దరు, మా ఇద్దరు' అనుకుంటుందని ఎద్దేవా చేశారు. మోదీ, షా, అంబానీ, అదానీ ఈ నాలుగు శక్తులే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని ఆరోపించారు. బిలియనీర్లకు లబ్ధి చేకూర్చడం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేశారని మండిపడ్డారు. అనంతరం జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాతో దోచుకున్నారని రాహుల్ విమర్శించారు.
''మేము కులగణన కోసం డిమాండ్ చేస్తే, మోదీ కులాల వారీగా జనాభా గణన జరగదని చెప్పారు. ఇండియా కూటమి పట్టుబట్టింది. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ సైతం కులగణనను సమర్ధించింది. లేటరల్ ఎంట్రీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. దీంతో మోదీ భయపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో మోదీ ఛాతీ విశాలంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో మోదీని సైకలాజికల్‌గా ఫినిష్ చేశాం. త్వరలోనే మోదీని, బీజేపీని ప్రభుత్వాన్ని గద్దెదించుతాం'' అని రాహుల్ గాంధీ తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో (సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత) పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
JKలో కాంగ్రెస్, NC సీట్ల సర్దుబాటు ఖరారు- ఎవరికి ఎన్ని సీట్లంటే? - Jammu Kashmir Election 2024