- 9.05PM
లోక్‌సభ ఫిబ్రవరి 5కు వాయిదా పడింది. శని, ఆదివారాలు సమావేశాలకు విరామం ఉంటుంది. సోమవారం ఉదయం 11 గంటలకు సభ తిరిగి సమావేశం కానుంది.
- 6.10PM
రాజ్యసభ సోమవారాని(ఫిబ్రవరి 5)కి వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు సభ తిరిగి సమావేశం కానుంది.
- 12.39PM
ఝార్ఖండ్ రాజకీయ సంక్షోభంపై ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తారు. అందుకు సభాపతి అంగీకరించకపోవడం వల్ల లోక్‌సభ నుంచి ఇండియా కూటమి ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
- 11.30 AM
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ అరెస్ట్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సభలో వాగ్వాదం జరిగింది.
- 11.07 AM
పార్లమెంట్ ఉభయసభలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.
- 10.37 AM
జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ అరెస్టు అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తాలని ఇండియా కూటమి పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
- 10.26 AM
Parliament Budget Session 2024 : పార్లమెంటులో శుక్రవారం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తర్వాత రాష్ట్రపతికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. మరోవైపు, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో సమావేశమవ్వనున్నారు.