NDA Parliamentary Meeting 2024 : పార్టీలతో సంబంధం లేకుండా దేశానికి సేవ చేయడం మన మొదటి బాధ్యతని, దేశానికి తొలి ప్రాధాన్యమిస్తూ పని చేయాలని ఎన్‌డీఏ ఎంపీలకు హితోపదేశం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. తమకు ప్రధాని చాలా ముఖ్యమైన మంత్రాన్ని ఉపదేశించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి ఎంపీ దేశానికి సేవ చేసేందుకు సభకు ఎన్నికయ్యారని, నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై ఎంపీలు అవగాహన పెంచుకోవాలని మోదీ దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు.
VIDEO | NDA leaders meet and greet PM Modi during the parliamentary party's meeting in Parliament complex.
— Press Trust of India (@PTI_News) July 2, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/Jdsu8NwO71
'పార్లమెంట్ నియమాలు పాటించాలి'
మంచి ఎంపీగా ఎదగడానికి అవసరమైన పార్లమెంట్ నియమాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రవర్తనను అనుసరించాలని ఎన్‌డీఏ ఎంపీలను ప్రధాని మోదీ కోరారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రధాని మార్గ నిర్దేశనం ఎంపీలందరికీ, ప్రత్యేకించి తొలిసారి సభకు వచ్చిన సభ్యులకు ఒక మంచి మంత్రంగా తాము భావిస్తున్నామని చెప్పారు. ప్రధాని హితోబోధ చేసిన మంత్రాన్ని తాము అనుసరించాలని నిర్ణయంచుకున్నామని వెల్లడించారు. 'సీనియర్ ఎంపీల నుంచి పార్లమెంటరీ నియమాలు ప్రవర్తనను నేర్చుకోవాలని నూతన ఎంపీలకు మోదీ సూచించారు. తొలిసారిగా కాంగ్రెసేతర నేత మూడోసారి ప్రధాని కావడం వల్ల ప్రతిపక్షాలు కలత చెందాయని అన్నారు. పార్లమెంటరీ సమస్యలను అధ్యయనం చేయాలని, క్రమం తప్పకుండా పార్లమెంటుకు హాజరు కావాలి. మీడియా ముందు సమస్యలను ప్రస్తావించే ముందు వాటిపై పూర్తిగా అధ్యయనం చేయాలి. ఎంపీలందరూ నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడూ టచ్‌లో ఉండాలి' అని ప్రధాని మోదీ సూచనలు చేసినట్లు కిరణ్ రిజిజు తెలిపారు.
VIDEO | " the first meeting of nda parliamentary party was held today. pm modi was felicitated by nda leaders for the historic third term. during the meeting, pm modi shared an important 'mantra' to all the mps and nda leaders. he said that mps have come here (parliament) to… pic.twitter.com/ghLSAhjApN
— Press Trust of India (@PTI_News) July 2, 2024
ప్రధానమంత్రలు చేసిన సేవ తెలుసుకోవాలి
ఎంపీలకు ప్రధాని మోదీ మరో విజ్ఞప్తి కూడా చేశారని కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి ఎంపీ వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించాలని మోదీ చెప్పారని వివరించారు. ప్రధానమంత్రి సంగ్రహాలయలో తొలి ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటివరకూ అందరూ ప్రధానుల ప్రస్థానం ఉందని వారి గురించి తెలుసుకోవాలని ఎంపీలకు మోదీ సూచించారని తెలిపారు. ఇందులో రాజకీయ అజెండా ఏమీ లేదని, ప్రతి ప్రధాని చేసిన కృషిని దేశం మొత్తం తెలుసుకోవడం, అభినందించడం, నేర్చుకోవడం వారికి నివాళులు అర్పించడం ఒక విధిలా భావించాలని మోదీ దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు.
#WATCH | Delhi | PM Modi arrives for NDA Parliamentary party meeting in Parliament premises pic.twitter.com/5EJ3lhCXo7
— ANI (@ANI) July 2, 2024
#WATCH | Delhi | NDA Parliamentary party meeting which was underway in Parliament premises, concludes pic.twitter.com/NQZfgLfM6p
— ANI (@ANI) July 2, 2024
మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన మోదీని ఎన్‌డీఏ నేతలు సన్మానించారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎన్‌డీఏ సమావేశం జరిగింది. ఉభయ సభల్లో జరిగిన చర్చలకు ప్రధాని మోదీ సాయంత్రం సమాధానం చెప్పనున్నారు.
రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్- ప్రతిపక్షనేత ప్రసంగంపై తీవ్ర దుమారం