ETV Bharat / bharat

నేషనల్​ గర్ల్​ చైల్డ్​ డే- అమ్మాయిలకు తల్లిదండ్రులు ఇచ్చే గిఫ్ట్​ ఇదే!​ - National Girl Child Day in telugu

National Girl Child Day 2024 : జనవరి 24.. జాతీయ బాలికా దినోత్సవం. మరి ఈరోజున మీ పిల్లలకు గిఫ్ట్స్​ ఇవ్వాలనుకుంటున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎప్పుడూ ఇచ్చే విధంగా బొమ్మలు, దుస్తులు.. కాకుండా వారి ఆరోగ్యాన్ని వారికి తిరిగివ్వండి. అదే మీరు లైఫ్​లో ఇచ్చే మర్చిపోలేని గిఫ్ట్​..

National Girl Child Day 2024
National Girl Child Day 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 12:31 PM IST

National Girl Child Day 2024 : బాలికలను కాస్త ప్రోత్సహిస్తే చాలు.. అద్భుతమైన విజయాలు సాధిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఆట పాటలు, క్రీడలు, కళలు.. ఇలా ఏ రంగంలో ప్రవేశించినా పతకాలు, బహుమతులు వారి సొంతం అవుతాయి. అయితే ఈ విజయాలు సాధించాలంటే బాలికలు ఆరోగ్యంగా ఉండాలి. కాగా, చాలా మంది తల్లిదండ్రులు.. పిల్లల విషయంలో చేసే పొరపాట్లు ఏంటంటే.. "మన కళ్ల ముందు ఆడుతూ, పాడుతూ ఆరోగ్యంగానే ఉన్నారు కదా" అని అనుకుంటారు. కానీ, వారి శరీరంలో జరిగే మార్పుల వల్ల కొన్ని రకాల లక్షణాలు కనిపించవకపోవచ్చని నిపుణులంటున్నారు. ముఖ్యంగా ఎదిగే బాలికలకు ఏటా కొన్ని రకాల టెస్ట్‌లను చేయించాలని చెబుతున్నారు. నేడు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మీరు మీ అమ్మాయికి ఏదైన గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటే ఈ టెస్ట్‌లు చేయించమని సలహా ఇస్తున్నారు. మరి ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం..

National Girl Child Day : సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడానికి.. అలాగే వారి హక్కుల కోసం పోరాడటానికి ప్రోత్సహించేలా 2008 నుంచి భారత ప్రభుత్వం.. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2015 జనవరి 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బేటీ బచావో బేటీ పడావో పథకం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే 2024 ఏడాదికి ఇంకా థీమ్​ను ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. ఎదిగే అమ్మాయిలకు చేయించాల్సిన పరీక్షలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ (సీబీపీ): చాలా మంది అమ్మాయిలు రజస్వల అయిన తరవాత రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య గురించి తెలుసుకోవడానికి సీబీపీ చేయించాలి. దీనివల్ల శరీరంలో బ్లడ్​ శాతం, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌లు ఎంత శాతం ఉన్నాయో తెలుస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా కూడా గుర్తించవచ్చు. అలసట, బరువు తగ్గడం, జ్వరం, బలహీనత వంటి లక్షణాలు కనిపించి.. కారణం తెలుసుకోవడానికి కూడా సీబీపీ చేయించడం మంచిదని నిపుణులంటున్నారు.

స్నానం చేసేటప్పుడు లూఫా వాడే అలవాటు ఉందా? - సమస్యలు తప్పవట!

విటమిన్ ప్రొఫైల్ పరీక్ష : ఎదిగే బాలికలకు విటమిన్‌ ప్రొఫైల్ పరీక్ష చేయంచడం ఎంతో ముఖ్యం. దీనివల్ల శరీరంలో విటమిన్‌ డి, బి12 స్థాయులు ఎంత వరకు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అమ్మాయిలు ఆరోగ్యంగా ఉండటంలో ఈ రెండు విటమిన్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి వారి ఎముకలు, కండరాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

యూరిన్​ టెస్ట్​: మైక్రోస్కోప్‌ ద్వారా చేసే మూత్రపరీక్ష ఏవైనా ఇన్ఫెక్షన్స్‌ ఉంటే తెలియచేస్తుంది. బాలికల్లో పొత్తి కడుపు నొప్పి, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, యూరిన్​లో రక్తం, మంట వంటి లక్షణాలు కనిపిస్తే మూత్ర పరీక్ష చేయించాలి. ఒక్కోసారి యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్నా సింప్టమ్స్‌ కనిపించకపోవచ్చు. అందువల్ల ఒకసారి ఈ పరీక్ష చేయించడం మంచిది.

మల పరీక్ష : కొంతమంది బాలికలు తరచూ పొత్తికడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలతో బాధ పడుతుంటారు. అయితే దీనికి కారణం తెలుసుకోవడానికి మల పరీక్ష చేయించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా శరీరంలో ఉన్న జీర్ణకోశ ఇన్ఫెక్షన్లను గుర్తించవచ్చని అంటున్నారు. అలాగే ఆహారం ద్వారా వచ్చే వ్యాధులకు కారణమయ్యే కారకాలను కూడా తెలుసుకోవచ్చంటున్నారు.

కంటి పరీక్ష : ఈ రోజుల్లో డిజిటల్‌ చదువులు ఎక్కువయ్యాయి. దీనివల్ల చాలా మంది కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీ పిల్లలకు కూడా ఒకసారి కళ్లను టెస్టింగ్‌ చేయించండి. కంటి పరీక్ష చేయించుకోవడం వల్ల.. దగ్గరి చూపు, దూరం చూపును అంచనా వేయడానికి, ఆప్టిక్ నరాలు, లెన్స్‌ల ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. సరైన దృష్టి కోసం బాలికలకు ఇది ఉపయోగపడుతుంది.

థైరాయిడ్‌ పరీక్ష : బాలికల్లో యుక్తవయస్సులో వచ్చే కొన్ని శారీరక మార్పుల వల్ల హార్మోన్ల అసమతుల్యత కలుగుతుంది. దీనివల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నెలసరి మార్పులకు కూడా ఇదే కారణం కావొచ్చని నిపుణులంటున్నారు. అందుకే అమ్మాయిలకు థైరాయిడ్ పరీక్ష చేయించాలని అంటున్నారు.

తిన్న వెంటనే కడుపులో మంటగా ఉంటోందా? కారణాలు ఇవే అంటున్న నిపుణులు!

అలర్ట్ : అతి చలిగా అనిపిస్తోందా? ​- ఈ సమస్యే కావొచ్చట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.