Kerala Temple Blast : ఓవైపు సంప్రదాయ దుస్తుల్లో కళాకారుల ప్రదర్శనలు.. మరోవైపు టపాసులు పేలుళ్ల శబ్దాలు.. అక్కడే ఉండి ఎంతో ఉత్సహంగా తిలకిస్తూ దృశ్యాలను మొబైల్ ఫోన్స్‌లో రికార్డ్ చేస్తున్న భక్తులు.. ఇలా సంబరాలతో నిండిన ఆలయం మొత్తం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఉలిక్కిపడింది. ఏం జరిగిందో అని చూసేసరికి భారీ పేలుడు సంభవించింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఒక్కసారిగా భయంతో ఆర్తనాదాలు చేస్తు పరుగులు పెట్టారు. దీంతో తొక్కిలాసట జరిగి అనేక మంది గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి కేరళలోని కాసర్‌గోడ్ ఆలయంలో జరిగిన విషాద ఘటన ఇది.
during the Nileshwaram Veerarkavu Kaliyattam in Kasaragod, an explosion at a fireworks storage site left 154 people injured, with 8 in critical condition. District Collector Imbashekhar reported that 97 of the injured are undergoing treatment.#explosion #Kerala #fireworks pic.twitter.com/EkxeerWihr
— Sreelakshmi Soman (@Sree_soman) October 29, 2024
అసలేం జరిగిదంటే!
కాసర్‌గోడ్ జిల్లా నీలేశ్వరం సమీపంలోని అంజోతంబలం వీరర్కవు ఆలయంలో గత రెండు రోజులుగా వార్షిక కాళియాట్లం ఉత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన తెయ్యం ఉత్సవంలో బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఆలయం సమీపంలోని బాణసంచా నిల్వ ఉంచిన షెడ్డుపై పడగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. బాంబు పేలిందా అనే రీతిలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చి తెయ్యం ఉత్సవాన్ని తిలకిస్తున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించింది. ఈ భయానక దృశ్యాలు ఓ మొబైల్ ఫోన్‌లో రికార్డయ్యాయి.
తొక్కిసలాట వల్లే
బాణాసంచా పేలుడుతో అక్కడ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఒక్కసారిగా పరుగులు పెట్టారు. పలువురు చిన్నారులు, మహిళలు హాహాకారాలు చేస్తూ సాయం కోసం అర్థించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 150 మందికిపైగా గాయపడగా వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను కాసరగోడ్, కన్నూర్, మంగళూరులోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
'నిబంధనలు పాటించలేదు'
భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని జిల్లా కలెక్టర్ ఇంబా శేఖర్ తెలిపారు. బాణసంచా నిల్వ ఉన్న ప్రాంతానికి కనీసం 100 మీటర్ల దూరంలో క్రాకర్లు కాల్చాలనే నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. నిల్వలకు సైతం అనుమతి తీసుకోలేదని విచారణలో వెల్లడైందని వివరించారు. ఘటనా స్థలంలో నమూనాలు సేకరించి కేసు నమోదు చేశామని చెప్పారు. ఆలయ అధ్యక్ష, కార్యదర్శిని అదుపులోని తీసుకున్నారు.
'తీవ్రంగా కలరపెట్టంది'
ఆలయంలో జరిగిన బాణసంచా ప్రమాదం తీవ్రంగా కలవరపెట్టిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. వారికి కావాల్సిన సహాయక చర్యలకు సహకరించాలని పార్టీ కార్యకర్తలందరికీ సూచించారు.
Deeply disturbed by the tragic firecracker blast in Kasargod, which has left hundreds injured, many in critical condition. My thoughts and prayers are with those wounded and their families during this difficult time. I urge all INC workers to mobilise and support relief efforts…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 29, 2024