ETV Bharat / bharat

సౌత్​ ఇండియాలోని ఈ ఆలయాలు చూసొస్తారా? - వైజాగ్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర కూడా అందుబాటులోనే! - IRCTC Southern Divine Temple Tour - IRCTC SOUTHERN DIVINE TEMPLE TOUR

IRCTC Latest Tour Package : దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలకు అందుబాటు ధరలో ప్యాకేజీలు అందిస్తూ.. టూరిస్టులను తీసుకెళ్తోంది IRCTC టూరిజం. తాజాగా దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలనుకునే వారి కోసం విశాఖ నుంచి ఓ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

IRCTC Tour Packages
IRCTC Southern Divine Temple Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 6:31 PM IST

IRCTC Southern Divine Temple Tour: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర దర్శనీయ స్థలాల్లో పర్యటించేందుకు ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్​​ టూరిజం కార్పొరేషన్​ ప్రత్యేకమైన టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది. అందరికీ అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరలకే పలు ప్రాంతాలనూ చూపిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరిస్తోంది. తాజాగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలనుకునే వారి కోసం విశాఖపట్నం నుంచి స్పెషల్​ ప్యాకేజీని ప్రకటించింది. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఐఆర్​సీటీసీ SOUTHERN DIVINE TEMPLE TOUR EX VISAKHAPATNAM పేరుతో ప్యాకేజీ ప్రకటించింది. కుటుంబంతో పాటుగా వెళ్లి.. అన్ని ముఖ్యమైన ఆలయాలు సందర్శించాలనుకునే వారికి ఈ ప్యాకేజీ చాలా బాగుంటుంది. ఈ ప్యాకేజీలో పలు ప్రముఖ ఆలయాలను సందర్శించొచ్చు. ఇందులో కన్యాకుమారి, రామేశ్వరం, మదురై, త్రివేండ్రం లాంటి ప్రాంతాలకు వెళ్లొచ్చు. మెుత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఈ టూర్​ కొనసాగనుంది.

ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు విశాఖపట్నం నుంచి టూర్​ ప్రారంభమవుతుంది. టూరిస్టులు ఉదయం 8.40 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే.. మధ్యాహ్నం 3:35 నిమిషాలకు మదురై చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. ఫ్రెషప్​ అనంతరం సాయంత్రం మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రి డిన్నర్​ అనంతరం మదురైలో బస చేయాల్సి ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత రామేశ్వరం బయల్దేరుతారు. అక్కడికి చేరుకున్న తర్వాత హోటల్​లో చెకిన్​ అవ్వాలి. ఆ తర్వాత దనుష్కోడి సందర్శన ఉంటుంది. రాత్రికి రామేశ్వరంలోనే బస చేస్తారు.

కాశీ టూ నైమిశారణ్య వయా అయోధ్య - IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ!

  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయ దర్శనం ఉంటుంది. అలానే అక్కడ చుట్టుపక్కన ప్రదేశాలు చూడొచ్చు. మధ్యాహ్నం లంచ్​ తర్వాత కన్యాకుమారి బయల్దేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యాక.. ఆ రాత్రికి అక్కడే బస ఉంటుంది.
  • నాలుగో రోజు కన్యాకుమారిలో తెల్లవారుజామున సన్‌రైజ్​ పాయింట్ దగ్గర సూర్యోదయాన్ని చూడొచ్చు. బ్రేక్​ఫాస్ట్​ తర్వాత కన్యాకుమారి లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. కన్యాకుమారి దేవి ఆలయం, వివేకానంద రాక్ మెమొరియల్, తిరువల్లూర్ స్టాచ్యూ, గాంధీ మెమొరియల్ చూడొచ్చు. సాయంత్రం సూర్యాస్తమయం కూడా చూడొచ్చు. ఆ తర్వాత త్రివేండ్రం బయల్దేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్​ అయ్యి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ అనంతరం త్రివేండ్రం ఫుల్ డే సైట్ సీయింగ్ ఉంటుంది. పద్మనాభస్వామి ఆలయం, జూ, కోవలం బీచ్ చూడొచ్చు. రాత్రికి త్రివేండ్రంలో బస చేయాలి.
  • ఆరో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఉదయం హోటల్లో బ్రేక్​ఫాస్ట్ అనంతరం త్రివేండ్రం ఎయిర్​పోర్ట్​కు స్టార్ట్​ అవుతారు. అక్కడ ఉదయం 11 గంటలకు ఫ్లైట్​ ఎక్కితే​ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ సదరన్ డివైన్ టెంపుల్ టూర్ ప్యాకేజీ ధర:

  • ఈ టూర్​ ప్యాకేజీ ధర చూస్తే.. కంఫర్ట్​లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.38,005, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.39,880, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.51,400 చెల్లించాలి.
  • 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ. 34,255, 2 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.30,980 చెల్లించాలి.
  • ఇక ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, ఏసీ హోటల్‌లో బస, 5 బ్రేక్‌ఫాస్ట్, 5 డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్ కవర్ అవుతాయి.
  • ప్రస్తుతం ఈ టూర్​ ప్యాకేజీ ఆగష్టు 14వ తేదీన ప్రారంభమవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​ పై క్లిక్​ చేయండి.

మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారా? - 6 రోజుల పాటు IRCTC టూర్​ ప్యాకేజీ! ఈ ప్లేస్​లు కూడా చూడొచ్చు!

అటు శ్రీశైల మల్లన్న - ఇటు యాదాద్రి నరసింహ​ - తక్కువ ధరకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! పైగా ఈ ప్లేస్​లు కూడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.