ETV Bharat / bharat

కాశీ టూ నైమిశారణ్య వయా అయోధ్య - IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ! - IRCTC Ganga Ramayan Yatra - IRCTC GANGA RAMAYAN YATRA

IRCTC Special Packages : ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. తాజాగా IRCTC ఓ ప్యాకేజీని ప్రకటించింది. కాశీ, నైమిశారణ్య, అయోధ్య వరకు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించి రావొచ్చు. మరి.. ఈ టూర్​ ఎన్ని రోజులు సాగనుంది? ధర ఎంత? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

IRCTC Special Packages
IRCTC Special Packages (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 4:59 PM IST

IRCTC Ganga Ramayan Yatra Package: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర దర్శనీయ స్థలాల్లో పర్యటించేందుకు ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్​​ టూరిజం కార్పొరేషన్​ ప్రత్యేకమైన టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది. అతి తక్కువ ధరలకే పలు ప్రాంతాలనూ చూపిస్తూ వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. తాజాగా ‘గంగా రామాయణ్‌ యాత్ర (Ganga Ramayan Yatra)’ పేరిట పలు పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఈ యాత్ర పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

ఈ ప్యాకేజీలో భాగంగా.. నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్‌, సారనాథ్‌, వారణాసి పుణ్యక్షేత్రాలను చూడొచ్చు. ఈ యాత్ర 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. హైదరాబాద్‌ నుంచి విమానంలో వారణాసికి చేరుకోవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. చివరి రోజు లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌ వచ్చేయడం యాత్ర పూర్తవుతుంది.

ప్రయాణ వివరాలు చూస్తే..

  • తొలి రోజు ఉదయం 9:40 గంటలకు హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫ్లెట్​(6E 915) జర్నీ స్టార్ట్​ అవుతుంది. మధ్యాహ్నానికి వారణాసికి చేరుకుంటారు. అక్కడి నుంచి ముందు గానే బుక్‌ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఫ్రెషప్​ అయ్యి లంచ్​ ముగించుకొని కాశీ ఆలయ సందర్శనకు తీసుకెళ్తారు. తర్వాత గంగా ఘాట్‌ సందర్శన ఉంటుంది. రాత్రి వారణాసిలోనే బస ఏర్పాటు చేస్తారు.
  • రెండో రోజు ఉదయం హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ పూర్తి చేసుకొని సారనాథ్‌కు బయలుదేరుతారు. అక్కడ దర్శనం పూర్తి చేసుకొని మధ్యాహ్నానికి మళ్లీ వారణాసికి చేరుకుంటారు. అక్కడి నుంచి బిర్లా ఆలయానికి వెళతారు. తర్వాత ఘాట్ల సందర్శన ఉంటుంది. ఒకవేళ షాపింగ్​ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ రాత్రి బస కూడా వారణాసిలోనే ఉంటుంది.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి ప్రయాగ్‌రాజ్‌ బయలుదేరుతారు. అక్కడ అలోపీ దేవీ ఆలయం, త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. సాయంత్రం అయోధ్యకు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.

6 రోజుల్లో కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చుట్టొద్దామా? - తక్కువ ధరకే IRCTC సూపర్ ప్యాకేజీ! -

  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ పూర్తి చేసుకుని అయోధ్యలోని ఆలయాన్ని దర్శిస్తారు.
  • మధ్యాహ్నం అక్కడి నుంచి బయలు చేరి లఖ్‌నవూ చేరుకుంటారు. రాత్రి అక్కడే హోటల్‌లో బస ఏర్పాటు చేస్తారు.
  • ఐదో రోజు లఖ్‌నవూలోని హోటల్‌లో టిఫెన్​ పూర్తి చేసి నైమిశారణ్యానికి బయలుదేరుతారు. రోజంతా అక్కడే గడపాల్సి ఉంటుంది. సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి బస అక్కడే ఉంటుంది.
  • ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ పూర్తి చేసుకుని లఖ్‌నవూలోని చారిత్రక కాంప్లెక్స్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి హోటల్‌ చేరుకుంటారు.
  • సాయంత్రం 4 గంటల కల్లా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని విమానంలో హైదరాబాద్‌కి వచ్చేస్తారు. దీంతో టూర్​ కంప్లీట్​ అవుతుంది.

మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారా? - 6 రోజుల పాటు IRCTC టూర్​ ప్యాకేజీ! ఈ ప్లేస్​లు కూడా చూడొచ్చు! - IRCTC Treasures of Tamil Nadu

ప్యాకేజీలో ఉండేవి :

  • హైదరాబాద్‌ నుంచి వారణాసి, లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌కు విమాన టికెట్లు ఉంటాయి.
  • వారణాసిలో రెండు రాత్రులు, అయోధ్యలో ఒక రాత్రి, లఖ్‌నవూలో రెండు రాత్రులు బస ఉంటుంది.
  • బ్రేక్​ఫాస్ట్​, రాత్రి భోజనం ఐదు రోజులు ఉంటుంది. మధ్యాహ్న భోజనం మాత్రం ఒక రోజే ఉంటుంది. అలాగే ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.

ప్యాకేజీ ఛార్జీలు.. (ఒకరికి)

  • సింగిల్‌ ఆక్యుపెన్సీ- రూ.39,400
  • డబుల్‌ ఆక్యుపెన్సీ- రూ.31,000
  • ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ- రూ.29,850
  • చైల్డ్‌ విత్‌ బెడ్‌ (5- 11ఏళ్లు)- రూ.27,650
  • చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (5- 11ఏళ్లు)- రూ.23,050
  • చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (2- 4ఏళ్లు)- రూ.17,400
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ జులై 20న, ఆగష్టు 12, 16, 21వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

"గాడ్స్ ఓన్ కంట్రీ"కి IRCTC సూపర్ ట్రిప్ - ప్రకృతి సోయగాల్లో తడిసి ముద్దైపోవచ్చు!

అటు భగవత్​ దర్శనాలు - ఇటు బీచ్​లో సరదాలు - సముద్ర తీరానికి IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.