ETV Bharat / bharat

సెప్టెంబర్​ నుంచి జనగణన! దాదాపు 18 నెలల పాటు సర్వే!! - Population Census 2024

Population Census 2024 : దేశంలో సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల కార్యక్రమం వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌కు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు వెల్లడించింది. పదేళ్లకు ఒకసారి చేపట్టే ఈ కార్యక్రమాన్ని 2021లోనే నిర్వహించాల్సి ఉండగా కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా వాయిదా పడింది. అప్పటి నుంచి పలు కారణాలతో జన గణన వాయిదా పడుతూ వచ్చింది.

Population Census 2024
Population Census 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 10:46 PM IST

Population Census 2024 : దేశంలో సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల కార్యక్రమం ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. పదేళ్లకు ఒకసారి చేపట్టే ఈ కార్యక్రమాన్ని 2021లోనే నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పుడు కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా వాయిదా పడింది. అప్పటి నుంచి పలు కారణాలతో జన గణన వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా వచ్చే నెల నుంచి దీన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో ప్రారంభమైతే కొత్త సర్వే పూర్తి కావడానికి దాదాపు 18 నెలలు పట్టే అవకాశమున్నట్లు పేర్కొన్నాయి. ప్రధాని కార్యాలయం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉందని వెల్లడించాయి.

జన గణనను చేపట్టే కేంద్ర హోంశాఖ, కేంద్ర గణాంకాల శాఖలు కాల పరిమితిని నిర్ణయించాయని 2026 మార్చి నాటికి 15 సంవత్సరాల డేటాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ అధికారులు తెలిపారు. అయితే దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, గణాంకాల శాఖ నుంచి ఎటువంటి ధ్రువీకరణ రాలేదు. జనగణన, జాతీయ జనాభా నమోదు (NPR) ప్రక్రియ కోసం ఈ సారి బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.1,309.46 కోట్లను కేటాయించారు. మూడేళ్ల క్రితం నాటి కేటాయింపులతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే. 2021-2022లో జన గణనకు రూ.3,768 కోట్లను ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు.

ఇక జన గణన ఆలస్యంపై పలువురు నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర గణాంక సర్వేల నాణ్యతపై ఇది ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం చాలా వాటికి 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. గత ఏడాది ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం జనాభా విషయంలో చైనాను భారత్‌ అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.