ETV Bharat / bharat

ఆ కాలేజీలో చదివితే యావరేజ్​గా రూ.23లక్షల జీతం పక్కా- 22మందికి రూ.కోటిపైనే! - Highest Salary Placements - HIGHEST SALARY PLACEMENTS

Highest Salary Placements : ఐఐటీ బాంబే విద్యార్థులు క్యాంపస్​ రిక్రూట్​మెంట్​లో అదరగొట్టారు. 22 మంది విద్యార్థులు రూ.కోటికి పైగా వార్షిక వేతనంతో కొలువులు సాధించారు. మొత్తం 1,475 మంది విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్​మెంట్​లో కొలువులు సాధించినట్లు ఐఐటీ బాంబే వెల్లడించింది.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2024, 1:43 PM IST

Highest Salary Placements : దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబే విద్యార్థులు జాక్‌ పాట్‌ కొట్టారు. 22 మంది విద్యార్థులు రూ.కోటికి పైగా వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2023-24 నియామకాల సీజన్​లో మొత్తం 1,475 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఈసారి సగటు వేతన ప్యాకేజీ రూ.23.50 లక్షలుగా ఐఐటీ బాంబే తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్లేస్​మెంట్ సీజన్‌ ముగిసినట్లు పేర్కొంది.

వారికే ఎక్కువ ఉద్యోగాలు
ఐఐటీ బాంబే నిర్వహించిన నియామక ప్రక్రియలో ఇంజినీరింగ్‌, టెక్నాలజీ విభాగంలో ఎక్కువ మంది విద్యార్థులు కొలువులు సాధించారు. 106 కోర్ ఇంజినీరింగ్ కంపెనీల్లో 430 మంది విద్యార్థులు ఎంట్రీ లెవల్ పొజిషన్స్​లో ఎంపికయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్​లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్ నియామకాలు కొంచెం పెరిగాయి. క్యాంపస్ ప్లేస్​మెంట్ ద్వారా 307 మంది విద్యార్థులకు 84 కంపెనీలు ఐటీ/సాఫ్ట్​వేర్ ఉద్యోగాలను ఆఫర్ చేశాయి. సాఫ్ట్​వేర్ రంగంలోనే అత్యధిక నియామకాలు జరిగాయి. అయితే గతేడాదితో పోలిస్తే తక్కువగానే ఉండడం గమనార్హం.

ఈ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్!
ట్రేడింగ్, బ్యాంకింగ్, ఫిన్‌ టెక్ వంటి 29 కన్సల్టింగ్ కంపెనీలు 117మంది విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చాయి. ఆర్థిక రంగానికి చెందిన ఉద్యోగాల్లో 33 మంది విద్యార్థులు జాబ్ ఆఫర్లు పొందారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, మొబిలిటీ, 5జీ, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఎడ్యుకేషన్‌ రంగాల్లో కూడా నియామకాలు జరిగాయి.

పెరిగిన రిక్రూటింగ్ కంపెనీల సంఖ్య
ఈ ఏడాది ఐఐటీ బాంబే నిర్వహించిన నియామక ప్రక్రియలో పాల్గొన్న రిక్రూటింగ్ కంపెనీల సంఖ్య 12 శాతం పెరిగింది. 543 కంపెనీలు ప్లేస్​మెంట్ ప్రక్రియ కోసం నమోదు చేసుకున్నాయి. వీటిలో 388 కంపెనీలు యాక్టివ్​గా పాల్గొనగా, 364 కంపెనీలు విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు ఇచ్చాయి. ప్లేస్​మెంట్లలో పాల్గొన్న వారిలో 78 మంది విద్యార్థులు జపాన్, తైవాన్, ఐరోపా, అమెరికా, నెదర్లాండ్స్, హాంకాంగ్ వంటి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చినట్లు ఐఐటీ బాంబే తెలిపింది.

2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్లేస్​మెంట్లలో కోర్ ఇంజినీరింగ్, ఐటీ, సాఫ్ట్​వేర్ ప్రోగ్రామింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్, కన్సల్టింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, హై ఎండ్ టెక్నాలజీ, టెక్నికల్ సర్వీసెస్ వంటి బహుళ రంగాల్లో విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఐఐటీ బాంబేలో ప్లేస్​మెంట్ డ్రైవ్ 2023 జులైలో ప్రారంభమై, 2024 జులై 7న ముగిసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.