ETV Bharat / bharat

జాతిరత్నాలు "ముర్గ్ ముసల్లం" : ఈ చికెన్​ రెసిపీ తిన్నారంటే - వారెవ్వా అనాల్సిందే! - Murg Musalam

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 2:11 PM IST

How To Make Murg Musalam : చికెన్​తో.. ధమ్ బిర్యానీ మొదలు ఎన్నో రకాల రెసిపీలు చేస్తారు. వాటిల్లో దేనికదే స్పెషల్. అయితే.. "ముర్గ్ ముసల్లం" రెసిపీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇది మొఘల్ వంటకం. దీన్ని ఒక్కసారి టేస్ట్​ చేశారంటే.. ఇక ఎప్పటికీ వదిలిపెట్టరు. అంత అద్భుతంగా ఉంటుంది. మరి.. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Murg Musalam
How To Make Murg Musalam (ETV Bharat)

Murg Musalam Recipe : చికెన్​తో.. కర్రీలు, ఫ్రైలు, రకరకాల బిర్యానీలు.. ఇలా వందల రకాల రెసిపీలు ఉన్నాయి. కానీ.. ఇప్పటికీ మెజారిటీ జనం ఇళ్లలో రెగ్యులర్​గా ఒకే రకం కర్రీ​ చేసుకుంటుంటారు. కానీ.. కొత్త రకం వంటలను ట్రై చేసినప్పుడే కదా.. చికెన్​ను సరికొత్తగా ఆస్వాదించగలిగేది! అందుకే.. ఈసారి ఒక లెజెండరీ చికెన్ రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాం. అదే.. "ముర్గ్​ ముసల్లం". జాతిరత్నాలు సినిమాలో ఈ రెసిపీ గురించి ఓ స్పెషల్ సీన్ ఉంటుంది. అలా.. ఈ రెసిపీ కూడా నేటి జనరేషన్​కు ఓ జాతిరత్నమైంది.

నిజానికి.. ఇది ఒక పురాతన మొఘల్ వంటకం. దీన్ని ఒక్కసారి టేస్ట్​ చేశారంటే.. వదిలిపెట్టరు. దీని టేస్ట్ మాత్రమే కాదు.. ఈ రెసిపీలో చికెన్​ ను వాడే విధానంగా కూడా సరికొత్తగా ఉంటుంది. చికెన్​ ను ముక్కలుగా చేసి కుక్ చేయడం మనకు తెలుసు. కానీ.. ఈ ముర్గ్ ముసల్లం రెసిపీలో.. డ్రెస్సింగ్​ చేసిన కోడి మొత్తాన్ని యాధివిధిగా వాడుతారు. అంటే.. ముక్కలుగా కట్​ చేయడం ఉండదు. మొత్తం కోడినే నేరుగా కుక్​ చేస్తారు. మరి.. ఈ వెరైటీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ముర్గ్​ ముసల్లం​ తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • డ్రెస్సింగ్​ చేసిన కోడి -​ ఒకటి
  • నిమ్మరసం - 2 టేబుల్​స్పూన్​
  • నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్​- టేబుల్​స్పూన్​
  • పసుపు- టీస్పూన్​
  • కారం- టేబుల్​స్పూన్​
  • గరం మసాలా- టేబుల్​స్పూన్​
  • ధనియాల పొడి- టేబుల్​స్పూన్​
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె- సరిపడా
  • బాయిల్డ్​ ఎగ్స్​- 4
  • టమాటా ఫ్యూరీ -కప్పు
  • బ్రౌన్​ ఆనియన్స్​ పేస్ట్​- అరకప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​- 2 టేబుల్​ స్పూన్​లు
  • బాదం పేస్ట్​ - అరకప్పు
  • పెరుగు - కప్పు
  • ఫ్రెష్​ క్రీమ్- అరకప్పు
  • లవంగాలు-4
  • దాల్చిన చెక్క- కొద్దిగా
  • యాలకులు - 5

ముర్గ్​ ముసల్లం​ తయారీ విధానం :

  • ముందుగా ఒక గిన్నెలో నిమ్మరసం, కుంకుమ పువ్వు వాటర్​, కారం, గరం మసాలా, పసుపు కొద్దిగా నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన గుడ్లను వేసి.. వాటికి కూడా మసాలా పట్టించాలి.
  • ఆ తర్వాత కోడికి కత్తితో అక్కడక్కడా గాట్లు పెట్టాలి. చికెన్​కు మసాలా పట్టేందుకు ఇలా చేయాలి.
  • ఇప్పుడు ఆ మసాలా మిశ్రమాన్ని కోడికి పూర్తిగా పట్టించాలి. బయట బాడీతోపాటు చికెన్​ లోపల కుహరంలో కూడా బాగా రుద్ది మసాలా పట్టించాలి.
  • ఇలా మసాలా పట్టించిన కోడిని కనీసం 2 గంటల పాటు పక్కన పెట్టాలి. అవకాశం ఉంటే రాత్రంతా ఫ్రిజ్ లో పెడితే ఇంకా బాగుంటుంది.
  • తర్వాత.. కోడి స్టమక్​లో ఉడికించిన ఎగ్స్​ పెట్టాలి. అవి బయటకి రాకుండా కోడి రెండు కాళ్లను దారంతో కట్టేయాలి.
  • ఈ ప్రాసెస్ తర్వాత కోడిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ గ్యాప్​లో మసాలా చక్కగా కోడికి పడుతుంది.
  • ఇప్పుడు ఒక గిన్నెలో టమాటా ఫ్యూరీ (టమాటా గుజ్జు), బ్రౌన్ ఆనియన్​ పేస్ట్(ముందుగానే ఉల్లిగడ్డను కట్ చేసుకొని ఆయిల్​లో వేయించుకొని.. వాటిని మిక్సీ పట్టుకోవాలి.) అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, బాదం పేస్ట్​, పెరుగు, ఫ్రెష్​ క్రీమ్​, సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • తర్వాత చికెన్​ ఉడికించడానికి ఒక పెద్ద ఐరన్​ కడాయిలో ఆయిల్​ పోసి హీట్​ చేయాలి. అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్​ చేసుకోవాలి.
  • ఈ ఆయిల్​లో లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలి.
  • ఇప్పుడు మ్యారినేట్​ చేసుకున్న చికెన్​ని వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
  • ఒకవైపు కోడి మొత్తం ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత.. రెండవవైపు తిప్పాలి.
  • ఇప్పుడు టమాటా ప్యూరీతో చేసిన మిశ్రమాన్ని చికెన్​లో వేసుకోవాలి.
  • కుక్ అవుతున్న కోడి అడుగు అంటుకోకుండా.. మధ్య మధ్యలో తిప్పుతూ 20 నుంచి 25 నిమిషాల సేపు ఉడికించుకోవాలి.
  • గ్రేవీ చిక్కగా మారిన తర్వాత.. కొద్దిగా రోజ్​ వాటర్​ యాడ్​ చేసుకుంటే సరిపోతుంది.
  • అంతే.. నోరూరించే ముర్గ్​ ముసల్లం​ రెసిపీ రెడీ అయిపోయినట్టే..
  • దీనిని రోటీ, పుల్కాలతో తింటే టేస్ట్​ అద్దిరిపోతుందంటే నమ్మాల్సిందే.
  • ఈ అరుదైన రెసిపీని ఈ సండే మీ ఇంట్లో తయారు చేయండి. ఇంటిల్లిపాదీ ఆనందంగా ఆస్వాదించండి.

ఇవి కూడా చదవండి :

రెస్టారెంట్​ స్టైల్​ అపోలో చికెన్​ రెసిపీ - ఈ వర్షాకాలంలో రుచి చూడాల్సిందే గురూ!

ఓ వైపు వర్షం.. మరోవైపు సండే : "అద్దిరిపోయే నాటుకోడి పులుసు" ఇలా ప్రిపేర్ చేయండి! - యమ్మీ యమ్మీగా జుర్రుకోవాల్సిందే!

సండే స్పెషల్ : జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీ - ఆహా ఏమి రుచి అంటారంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.