ETV Bharat / bharat

మసాలా ఫిష్ ఫింగర్స్.. ఈ సండే అద్భుతమైన స్నాక్!

Masala Fish Fingers : ఫ్రైడ్ ఫుడ్స్ ఎంత హెల్దీ అనేది అందరికీ తెలిసినప్పటికీ.. నోరూరించే వాటి రుచిని ఆస్వాదించకుండా జనం ఉండలేరు. అందుకే.. తరచూ బయట నుంచి తెచ్చుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా.. ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచి నూనె వినియోగిస్తాం.. దినుసులన్నీ క్వాలిటీవి వాడుతాం కాబట్టి నాణ్యమైనవి తినొచ్చు. ఈ సండే.. ఇలా ఇంట్లోనే చేసుకొని తినడానికి మీకోసం సూపర్ రెసిపీ రిఫర్ చేస్తున్నాం.. అదే మసాలా ఫిష్ ఫింగర్స్ రెసిపీ.

Masala Fish Fingers
Masala Fish Fingers
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 8:44 AM IST

Masala Fish Fingers : మసాలా ఫిష్ ఫింగర్స్ అనేది.. చాలా ఈజీగా తయారు చేయగల రెసిపీ. ఎక్కువ శ్రమ లేకుండానే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ వంటకాన్ని కొన్ని డిప్స్ లేదా చట్నీస్​తో ఓ పట్టు పట్టొచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా బాగుంటుంది. కొందరు పిల్లలు చేపలు తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి ఈ రెసిపీ చేసి చేశారంటే.. వదలకుండా లాగిస్తారు. వాళ్లకు నచ్చిన రంగుతోపాటు బయట క్రంచీగా.. లోపల సాఫ్ట్​గా ఉండడంతో చక్కగా తినేస్తారు.

ఈ మసాలా ఫిష్ ఫింగర్స్​ను కేవలం ఇంట్లోనే కాకుండా.. కిట్టీ పార్టీలు, చిన్న చిన్న మీటింగ్స్​లోనూ సర్వ్ చేసుకోవడానికి సూపర్​గా ఉంటాయి. ఈ రెసిపీని మీరు తయారు చేశారంటే.. కచ్చితంగా అభినందనలు వెల్లువెత్తుతాయి. సో.. ఈ సండే ట్రేచేయండి. మీ ప్రియమైన వారితో కలిసి ఆనందించండి. మరి.. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి? ఇందుకోసం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

నలుగురి కోసం మసాలా ఫిష్ ఫింగర్స్ చేయాలంటే కావలసినవి :

8 ఫిష్ ఫిల్లెట్స్ (నిలువగా పొడవుగా ఉన్న చేప ముక్కలు)

2/3 టీస్పూన్ జీలకర్ర గింజలు

తగినంత ఉప్పు

2/3 టీస్పూన్ గరం మసాలా పొడి

2/3 కప్పుల నీరు

2/3 కప్పుల బ్రెడ్ ముక్కలు

2/3 కప్పుల మైదా పిండి

2/3 టీస్పూన్ కారం

1 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం

1 1/2 టీస్పూన్ ధనియాల పొడి

2 1/2 కప్పుల ఆయిల్

మసాలా ఫిష్ ఫింగర్స్ ఎలా తయారు చేయాలి?

  • ముందుగా చేప ముక్కలను కడగాలి. నీళ్లు లేకుండా చేసి పొడిగా ఉంచండి.
  • ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నిమ్మరసం, ఉప్పు, ధనియాల పొడి వేయండి. ఇందులో ఫిష్ ఫిల్లెట్లను వేయండి.
  • వీటిని చక్కగా మెరినేట్ చేసి, సుమారు 2 గంటలపాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టండి.
  • తర్వాత ఓ గిన్నెలో మైదా పిండి వేసి.. నీటితో కలపండి. ఉండలు చుట్టకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, గరం మసాలా, కారం వేసి బాగా కలపాలి.
  • స్టవ్​ మీద బాణలి పెట్టి.. అందులో నూనె వేసి వేడి చేయండి.
  • ఈ లోపు ఒక పెద్ద ప్లేట్ మీద బ్రెడ్ ముక్కలను పూర్తిగా పొడి చేయండి..
  • ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కలను మైదా మిశ్రమంలో ముంచి, బ్రెడ్ ముక్కల పొడిని అన్ని వైపులా ఫిష్ ముక్కలకు పట్టించి నూనెలో వేయండి.
  • వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
  • వేగాయనుకున్న తర్వాత తీసి పేపర్ టవల్స్ మీద వేయండి.. అడిషనల్ ఆయిల్ ఉంటే పీల్చుకుంటాయి.
  • ఆ తర్వాత వేడి వేడిగా ఆరగించాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.