How to Make Homemade French Fries : ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే చాలా మందికి నోరూరిపోతుంది. బంగాళదుంపలతో చేసే వీటిని వయసుతో ప్రమేయం లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక చిన్నపిల్లలైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటికి కాస్త ఉప్పు(Salt), కారం, మసాలా దట్టించి తింటే.. ఆ టేస్టే వేరేలెవల్. అయితే.. ఈ ఫుడ్‌ను చాలా మంది బయటే కొనుగోలు చేస్తారు. ఇంట్లో చేయడం చాలా ప్రాసెస్ అనుకుంటారు. కానీ.. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి.. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
- పెద్ద సైజ్‌లో ఉన్న బంగాళదుంపలు 2
- ఆలూ ముక్కలు వేయించడానికి సరిపడా నూనె
- రుచికి తగినంత ఉప్పు
ఫ్రెంచ్ ఫ్రైస్ తయారుచేసుకునే విధానం..
- ముందుగా చాకుతో బంగాళదుంపల తొక్క తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఆలుగడ్డలను కట్ చేసేటప్పుడు అవి మరీ మందంగా లేదా చాలా సన్నగా లేకుండా చూసుకోవాలి.
- ఆ తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపలను ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా ట్యాప్ వాటర్ కింద శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం మరో బౌల్లో కూల్ వాటర్ తీసుకొని అందులో కాసింత ఉప్పువేసుకుని వాటిని 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలి. ఒకవేళ కూల్ వాటర్ లేకపోతే ఫ్రిజ్‌లో ఉండే ఐస్‌క్యూబ్స్ కొన్ని నీళ్లలో వేసుకొని అందులో నానబెట్టుకోవాలి.
- అనంతరం వాటిని బౌల్ నుంచి తీసి ఒక క్లాత్ మీద కాసేపు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో బంగాళదుంపలను వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి.
- ఆ తర్వాత నూనె తగినంత వేడి అయ్యాక సిద్ధం చేసుకున్న బంగాళదుంపలను అందులో వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
- అనంతరం వేయించిన బంగాళదుంప ముక్కలను నూనె నుంచి తీసి టిష్యూ పేపర్ మీద వేసి చల్లార్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆ ముక్కలను పట్టిన అదనపు నూనెను టిష్యూ పేపర్స్ పీల్చుకుంటాయి. అంతే ఎంతో రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ.
- ఒకవేళ మీరు వాటిని మరింత టేస్ట్‌గా తినాలనుకుంటే.. కాస్త ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లుకొని తినేయొచ్చు.
- అదేవిధంగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను టమాటో సాస్‌తో తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది.
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు సంబంధించిన కొన్ని టిప్స్..
- మీరు మరింత పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారుచేసుకోవాలనుకుంటే.. కట్ చేసిన బంగాళదుంపలను 20 నుంచి 30 నిమిషాలు ఐస్ వాటర్‌లో నానబెట్టండి.
- అదేవిధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ త్వరగా నల్లబడకుండా చక్కగా క్రిస్పీగా ఉండాలంటే.. మీరు నానబెట్టిన ఆలుగడ్డ ముక్కలను ఒక రెండు, మూడు టిష్యూ పేపర్లు తీసుకొని వాటిపై వేసి బాగా ఆరబెట్టిన తర్వాత వేయించుకోండి.
పనీర్‌తో ఈ స్నాక్స్ ట్రై చేయండి- పిల్లలు నుంచి పెద్దల వరకు ఆహా అనడం ఖాయం!
స్నాక్స్‌లో ఆయిల్ ఫుడ్ వద్దు - ఇవి తింటే అదుర్స్ - రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!