ETV Bharat / bharat

జబర్దస్త్ టేస్టీ : మటన్ తలకాయ కూర ఇలా చేస్తే - ప్లేట్​తో సహా నాకేస్తారు! - Talakaya Kura Recipe In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 5:07 PM IST

Talakaya Kura Recipe : సండే అంటే నాన్​వెజ్ ఉండాల్సిందే. అయితే.. ప్రతిసారీ చికెన్, మటన్ కర్రీనే కాకుండా.. ఈ సారి మటన్ తలకాయ కూర ట్రై చేయండి. ఒక్కసారి తలకాయ కర్రీ రెసిపీని ఇలా తిన్నారంటే.. వన్స్​మోర్ ప్లీజ్ అంటారు! అంత బాగుంటుదీ కర్రీ టేస్ట్‌! మరి.. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

Talakaya Kura
Talakaya Kura Recipe (ETV Bharat)

Goat Head Recipe In Telugu : సండే వచ్చిందంటే.. నాన్​ వెజ్​ ప్రియులకు పండగ వచ్చినట్లే! ఉదయాన్నే మార్కెట్‌కి వెళ్లి చికెన్, మటన్‌, చేపలు అంటూ ఏదో ఒక నాన్‌వెజ్‌ ఐటమ్‌ని ఇంటికి తీసుకొస్తారు. అయితే.. ఈ సండే ఇంట్లో కాస్త మసాలా ఘాటు తగిలేలా.. తలకాయ కూర వండండి. ఈ కర్రీ చేయడం చేయడం చాలా కష్టమని చాలా మంది అనుకుంటుంటారు. కానీ.. ఇక్కడ చెప్పబోయే టిప్స్ పాటిస్తే.. చాలా ఈజీగా తలకాయ కర్రీని మీ ఇంట్లోనే ప్రిపేర్‌ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? తలకాయ కూరకు కావాల్సిన పదార్థాలేంటి? దాన్ని ఎలా తయారు చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మేక తల కూర - అరకేజీ
  • దాల్చిన చెక్క - చిన్నముక్క
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు అరటీస్పూన్‌
  • నూనె - రెండు టేబుల్‌స్పూన్‌లు
  • లవంగాలు-5
  • జీలకర్ర
  • మిరియాలు-కొన్ని
  • కరివేపాకు- రెండు రెమ్మలు
  • అల్లం - చిన్నముక్క
  • వెల్లుల్లి-5
  • ఉల్లిపాయలు-2
  • కొత్తిమీరు- కొద్దిగా
  • కొబ్బరి తురుము- పావు కప్పు
  • పచ్చిమిర్చి-5
  • గరంమసాలా పొడి- టీస్పూన్‌
  • ధనియాల పొడి- టీస్పూన్‌
  • టమాటాలు-3
  • కారం- 3 టేబుల్‌స్పూన్స్

మేక తలకాయ కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం :

  • ముందుగా కట్‌ చేసిన తలకాయ ముక్కలను నీళ్లతో బాగా కడగాలి.
  • అలాగే ఒకసారి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కూడా కడగాలి. ఇలా చేస్తే ముక్కలు చాలా బాగా క్లీన్‌ అవుతాయి.
  • ఇప్పుడు స్టౌ అన్‌ చేసి కుక్కర్‌లో ఆయిల్‌ వేసి, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి.
  • అలాగే ఇందులో అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి.
  • ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి, కొద్దిగా కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ మిశ్రమంలో నీళ్లు పోసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి.
  • తర్వాత ఇదే కుక్కర్‌లో ఆయిల్‌ వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి.
  • అలాగే ఇందులో టమాటాలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకోవాలి.
  • తర్వాత ఇందులో బాగా కడిగిన తలకాయ కూర ముక్కలను వేసి కలపాలి. అలాగే కారం, గరంమసాలాపొడి, ధనియాలపొడి కూడా యాడ్‌ చేయాలి.
  • ఇప్పుడు మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకున్న మిశ్రమం వేసి, గ్రేవికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. తర్వాత కుక్కర్‌ మూతపెట్టి ఒక 8 విజిల్స్‌ వచ్చే వరకు చూడాలి.
  • అంతే తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకుని దింపేసుకుని సర్వ్‌ చేసుకుంటే.. తలకాయ కూర టేస్ట్‌ అదిరిపోతుంది.
  • నచ్చితే మీరు ఈ సండే రోజున తలకాయ కూర రెసిపీ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

సండే స్పెషల్.. నాటుకోడి కూర.. బోటీ మసాలా ఫ్రై.. ఇలా చేశారంటే.. బొక్కకూడా వదలరు

బ్రెడ్​తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

సండే స్పెషల్​ - నోరూరించే ప్రాన్స్​ బిర్యానీ! ఇలా చేశారంటే మళ్లీ మళ్లీ తినడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.