ETV Bharat / bharat

39లక్షల కారుకు 34లక్షల రిజిస్ట్రేషన్​ ప్లేట్​- భారత్​లో అత్యంత ఖరీదైన నంబర్స్​ ఇవే!

Expensive Number Plates In India : లక్షలు ఖర్చు పెట్టి కార్లను కొనుగోలు చేస్తున్నవారిని చూసుంటాం. కానీ వాహనాల నంబర్ ప్లేట్ల కోసం లక్షలు ఖర్చు పెట్టేవారు కూడా ఉన్నారండి. అలా ఇండియాలో తమకు నచ్చిన కార్​ నెంబర్​ ప్లేట్​ కోసం లక్షల్లో ఖర్చు పెట్టిన వారు ఎవరో చూద్దాం.

Expensive Number Plates In India
Expensive Number Plates In India
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 3:46 PM IST

Expensive Number Plates In India : ఈ మధ్య కాలంలో వాహనాల నంబరు ప్లేట్లపై ఆసక్తి పెరుగుతోంది. అందరి కంటే భిన్నంగా ఉండాలని, కొంతమంది ఫ్యాన్సీ నంబర్​ ప్లేట్ల కోసం పోటీ పడుతున్నారు. అందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడట్లేదు. కొందరైతే కారు కంటే నంబర్​ ప్లేట్స్​ను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు తమకు నచ్చిన నంబర్‌ ప్లేట్ల కోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నారు.

గతేడాది ఏప్రిల్లో దుబాయ్​లో రూ.122 కోట్లకు అమ్ముడైన 'పి7' నంబర్​ ప్లేట్​ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. దీనిని దుబాయ్​లోని ఓ వ్యాపారవేత్త ఎమిరేట్స్ వేలంలో కొనుగోలు చేశారు. దీని వల్ల వచ్చిన ఆదాయం దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్​కు చెందిన బిలియన్ మీల్స్ ఎండోమెంట్ అనే గ్లోబల్ పుడ్ సంస్థకు సాయం చేశారు. దుబాయ్​లోనే కాదు, భారత్​లోనూ కొంత మంది భారీ మొత్తాల్లో వెచ్చించి నచ్చిన నంబర్ ప్లేట్స్ తీసుకున్నారు. వారేవరో చూద్దాం.

'07' కోసం రూ.34 లక్షలు
2020లో గుజరాత్​ అహ్మదాబాద్​కు చెందిన ఆశిక్ పటేల్ అనే వ్యక్తి రూ.39.5 లక్షలు వెచ్చించి టయోటా ఫార్చునర్ కారును కొనగోలు చేశారు. కానీ '07' అనే నంబర్ ప్లేట్ కోసం రూ.34 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ నంబర్​ తనకు అదృష్టమని అందుకే కొనుగోలు చేశానని ఆశిక్ పటేల్ తెలిపారు.

'0001' కోసం రూ.31 లక్షలు
కేరళకు చెందిన కే.ఎస్ బాలగోపాల్ అనే వ్యక్తి పోర్షే 718 బాక్స్​స్టర్ వాహనం కోసం రూ.31 లక్షలు ఖర్చు చేసి రిజిస్ట్రేషన్ ప్లేట్ తీసుకున్నారు. 'కేఎల్ 01 సీకే 0001' నంబర్ ప్లేట్ కోసం ఇంత మొత్తాన్ని అతడు వెచ్చించారు. రిజిస్ట్రేషన్ నంబర్​ కోసం రూ. 30 లక్షలు, రిజర్వేషన్​ ఫీజుగా లక్ష రూపాయలు చెల్లించారు. అయితే కారు ఖరీదు రూ.90 లక్షలు. ఈ నెంబర్ ఎంతో ప్రత్యేకమైనదని, అందుకే అంత ఖర్చు పెట్టి కొనుగోలు చేశారని బాలగోపాల్ తెలిపారు. 2017లో టయోటా ల్యాండ్ క్రూయిజ్​కు ఇదే రిజిస్ట్రేషన్ నంబర్​ కోసం రూ.19 లక్షలు చెల్లించారు.

16 లక్షలతో '0001'
రాజస్థాన్​ జైపుర్​కు చెందిన మోడల్ రాహుల్ తనేజా వద్ద చాలా రకాల కార్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఖరీదైన నంబర్​ పేట్లను కలిగి ఉన్నాయి. 2018లో రూ.1.5 కోట్ల జాగ్వార్ కారు కోసం "RJ 45 CG 0001" కోసం రూ. 16 లక్షలు రూపాయలు ఖర్చు చేశారు. అలానే 2011లో బీఎమ్​డబ్ల్యూ కారు కోసం "RJ 14 CP 0001" నంబర్​ ప్లేట్​ కోసం రూ. 10 లక్షలకుపైగా చెల్లించారు.

ముఖేశ్ అంబానీ '0001' కోసం 12 లక్షలు
భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ వద్ద విలాసవంతమైన కార్లు అనేకం ఉన్నాయి. రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉంది అంబానీ కుటుంబం. ముఖేశ్ అంబానీ 2022లో మూడో రోల్స్ రాయిస్​ కారు కోసం రూ. 13.14 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారు. ఈ కారుకు 0001 నంబర్ కోసం రూ. 12 లక్షలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

70 వేలతో '0555'
గతేడాది షారుక్ ఖాన్ రూ.10 కోట్లతో రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్​యూవీని కొనుగోలు చేశారు. దానికి '0555' నంబర్​ కోసం రూ. 70 వేలు చెల్లించారు.

కారుకు ఫ్యాన్సీ నంబర్​ కోసం రూ.122 కోట్లు ఖర్చు.. ప్రత్యేకత ఇదే..

స్కూటీ ధర రూ.71వేలు.. ఫ్యాన్సీ నంబర్​ కోసం రూ.15లక్షలు ఖర్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.