ETV Bharat / bharat

ఉద్యోగులకు గుడ్​ న్యూస్​- EPF గరిష్ఠ వేతన పరిమితి పెంపు! - EPFO Maximum Salary Limit - EPFO MAXIMUM SALARY LIMIT

EPFO Maximum Salary Limit : EPF ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం. దీని పరిధిలో ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తోంది.

EPFO Maximum Salary Limit
EPFO Maximum Salary Limit
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 3:53 PM IST

Updated : Apr 11, 2024, 4:17 PM IST

EPFO Maximum Salary Limit : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉండగా, ఆ మొత్తాన్ని రూ.21వేలకు పెంచనుందనే ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా దీనిని పెంచాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే, తాజాగా మరోసారి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది.

కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడొచ్చని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుండగా, ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా ఆ భారం పడనుంది. ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో రూ.6,500 ఉండగా, ఆ మొత్తాన్ని రూ.15వేలకు పెంచారు. మరోవైపు ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC) ఇప్పటికే వేతన పరిమితిని రూ.21 వేలకు చేర్చింది. ఈపీఎఫ్‌ కూడా ఆ మొత్తానికి చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఉద్యోగులకు ఎలా ప్రయోజనం?
వేతన పరిమితి పెంచడం వల్ల ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేర పెరగనుంది. సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. గరిష్ఠ వేతన పరిమితిని పెంచితే ఆ మేర ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్‌ఓ, ఈపీఎస్‌ ఖాతాలో జమయ్యే మొత్తం పెరుగుతుంది. దీంతో పదవీ విరమణ సమయానికి ఉద్యోగి తన భవిష్యనిధి నిల్వలను పెంచుకోవడానికి వీలుపడుతుంది.

వడ్డీ రేటు పెంపు
అంతకుముందు ఇటీవలె ఉద్యోగుల భవిష్య నిధి(EPF) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటును ఖరారు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటును నిర్ణయించింది. గత మూడేళ్లలో ఇదే అత్యధికం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15శాతంగా నిర్ణయించింది. అంతకు ముందు 2021-22లో 8.10శాతం వడ్డీ చెల్లించారు.

Last Updated : Apr 11, 2024, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.