ETV Bharat / bharat

వైమానిక దళంలో నయా ఎయిర్ క్రాఫ్ట్​ - కొత్త టెక్నాలజీతో DRDO దూకుడు! - DRDO on AMCA Fighter Jet - DRDO ON AMCA FIGHTER JET

DRDO On Stealth Aircraft: రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో దూసుకెళుతున్న డీఆర్​డీఓ భవిష్యత్‌ తరం స్టెల్త్‌ రకం ఫైటర్‌ జెట్‌ల అభివృద్ధిని వేగవంతం చేసింది. తమిళనాడులో జరుగుతున్న ఏవియేషన్‌ ఎక్స్‌పోలో 5.5 జనరేషన్‌ ఏఎమ్​సీఏ యుద్ధవిమాన నమూనాను ప్రదర్శించింది.

DRDO On Stealth Aircraft
DRDO On Stealth Aircraft (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 14, 2024, 7:27 AM IST

DRDO On Stealth Aircraft : వైమానిక దళంలో అతికొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్‌ రకం యుద్ధవిమానాలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) అభివృద్ధి చేస్తోంది. 5.5 జనరేషన్‌ స్టెల్త్‌ ఫైటర్‌ నమూనాను డీఆర్‌డీఓ 'ఏవియేషన్‌ ఎక్స్‌పో ఐడాక్స్‌ 2024'లో ప్రదర్శించింది. ప్రపంచంలో అతి కొద్ది దేశాలకే పూర్తి స్థాయి స్టెల్త్ పైటర్ల సాంకేతికత పరిమితమైంది. అతి త్వరలో భారత్‌ ఆ దేశాల సరసన చేరనుంది.

భారత్‌ వైమానిక దళాన్ని అజేయ శక్తిగా మార్చనున్న స్టెల్త్‌ యుద్ధ విమానాల సాంకేతిక అభివృద్ధి దేశానికి గర్వ కారణమని ఈ సందర్భంగా డీఆర్​డీఓ ఛైర్మన్‌ సమీర్‌ వి కామత్‌ తెలిపారు. భారత వైమానిక దళంలో ఇప్పటివరకు స్టెల్త్‌ రకం యుద్ధవిమానాలు, అభివృద్ధి సాంకేతికతలు లేవు. ప్రపంచంలో అతికొద్ది దేశాల దగ్గరే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అత్యాధునిక 5.5 జనరేషన్‌ అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను(ఏఎమ్​సీఏ) డీఆర్​డీఓ డిజైన్‌ చేసింది. అభివృద్ధి దశలో ఉన్న ఈ ఏఎమ్​సీఏ 2034లోగా డెవలప్‌మెంట్‌ ట్రయల్స్‌ను పూర్తి చేసుకోనుంది. వైమానిక దళంలో 2035లో ప్రవేశపెట్టేలా ప్రణాళికలు చేసినట్లు డీఆర్​డీఓ తెలిపింది.

వైమానిక విన్యాసాలు
తమిళనాడులోని సూలూరులో తరంగ్‌శక్తి పేరిట వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాలకు అనేక దేశాల రక్షణరంగ నిపుణులు హాజరయ్యారు. ఇందులో భాగంగా 'డిఫెన్స్‌ ఏవియేషన్‌ ఎక్స్‌పో ఐడాక్స్‌ 2024' ప్రదర్శనను నిర్వహించారు. ఇందులో డీఆర్​డీఓ దేశీయంగా అభివృద్ధి చేసిన 40కి పైగా అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించింది.

చైనాకు చెక్‌పెట్టే సరికొత్త ఆయుధం 'జొరావర్' రెడీ
ఇటీవల తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ-DRDO, ప్రైవేటు సంస్థ ఎల్‌ అండ్‌ టీ సంయుక్తంగా జొరావర్ అనే తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ యుద్ధ ట్యాంకును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయంగా రూపొందించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఒకేసారి అనేక టార్గెట్లు ఛేజ్- 'మిషన్‌ దివ్యాస్త్ర' సక్సెస్​- చైనాకు ఇక చుక్కలే!

DRDO అద్భుతం- ఒకేసారి 4లక్ష్యాలను ఢీకొట్టిన ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.