Atishi Health Condition : దిల్లీకి హరియాణా నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన ఆప్ మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆతిశీని లోక్‌నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రికి తరలించారు ఆప్ నేతలు. షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్లే ఆరోగ్యం ఆతిశీని ఆస్పత్రికి తరలించినట్లు దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
#WATCH | Delhi Water Minister Atishi being taken to LNJP hospital due to deteriorating health.
— ANI (@ANI) June 24, 2024
Atishi has been on an indefinite hunger strike since the last four days claiming that Haryana is not releasing Delhi's share of water. pic.twitter.com/BZtG4o9ThS
'సోమవారం రాత్రే ఆతిశీ ఘగర్ లేవల్స్ తగ్గిపోయాయి. రక్త నమూనాలను ఆస్పత్రికి పంపించినప్పుడు షుగర్ లేవల్స్ 36కి పడిపోయాయి అని వైద్యులు చెప్పారు. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆతిశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిపోర్ట్ వచ్చాకే ఏమైనా చెబుతాం' అని సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు.
#WATCH | Delhi Health Minister Saurabh Bharadwaj says, " her blood sugar levels had been dropping from the night. when we submitted her blood sample, her sugar levels came out to be 46. when we checked her sugar levels from a portable machine, her sugar levels came out to be 36...… https://t.co/CCFk08SPvB pic.twitter.com/Bbe6fNcuKr
— ANI (@ANI) June 24, 2024
'వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి'
బ్లడ్ శాంపిల్స్‌ను ఆస్పత్రి పంపించినప్పుడు ఆతిశీని వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని వైద్యులు సూచించినట్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. 'దిల్లీ ప్రజలకు నీరు అందించడం కోసం గత 5 రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నారు. ఏమీ తినకపోవడం వల్ల మరింత ఆరోగ్యం క్షీణించింది. ఆతిశీ రక్తనమూనాలకు ఆస్పత్రికి పంపించాం. ఆతిశీకి రక్తపోటు, చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని వైద్యులు నిర్ధరించారు. శరీరంలో కీటోన్ స్థాయి పెరిగిందనీ, బరువు కూడా తగ్గినట్లు తెలుస్తోందని అన్నారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని అన్నారు. అందకే ఆస్పత్రికి తీసుకెళ్లాం' అని సంజయ్ తెలిపారు.
#WATCH | Delhi: AAP MP Sanjay Singh says, " ... her blood sugar levels dropped to as low as 43. the doctors suggested she be admitted to the hospital before her condition worsens... she is being admitted to lnjp hospital. she has not eaten anything for the last 5 days. her sugar… pic.twitter.com/He7lqsOkIu
— ANI (@ANI) June 24, 2024
దిల్లీకి హరియాణా నుంచి నీటిని విడుదల చేయాలని జూన్ 21 నుంచి ఆతిశీ నిరాహార దీక్ష చేపట్టారు. దిల్లీకి అందాల్సిన నీటి కంటే 100 ఎమ్‌జీడీ (రోజుకు మిలియన్ గ్యాలన్లు) తక్కువగా హరియాణా ప్రభుత్వం విడుదల చేస్తోందని ఆతిశీ తెలిపారు. దీంతో దాదాపు 28 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆతిశీ అన్నారు. మరోవైపు హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీని కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించినట్లు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెల్లడించారు.
లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ- ఓం బిర్లాకే మరోసారి ఛాన్స్! వారితో బీజేపీ సంప్రదింపులు