Constitution Debate Today : భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్లమెంటులో వాడీవేడీ చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున లోక్‌సభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం చర్చను ప్రారంభించారు. రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసిన కొంతమంది ప్రయత్నాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని వ్యాఖ్యానించారు. విపక్షాల తరఫున కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చర్చను మొదలు పెట్టారు. ఎంపీగా ఇటీవలే పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఆమె, లోక్‌సభలో ప్రసంగం చేయడం ఇదే తొలిసారి.
రాజ్యాంగ రూపకల్పనకు కృషి చేసిన కొంతమంది నాయకుల ప్రయత్నాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఒక పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిందని కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. "భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవితాన్ని స్పృశిస్తుంది. జాతి నిర్మాణానికి మార్గాన్ని చూపుతుంది. ప్రపంచ వేదికపై భారతదేశానికి తన స్థానాన్ని ఇవ్వడానికి ఇది ఒక రోడ్ మ్యాప్. రాజ్యాంగ సభలో భాగం కాకపోయినా పండిట్ మదన్ మోహన్ మాలవీయ, లాలా లజపతి రాయ్, భగత్ సింగ్, వీర్ సావర్కర్ వంటి నేతలు ఆలోచనలు అందులో భాగమే. రాజ్యాంగ రూపకల్పనలో వారందరూ కీలకపాత్ర పోషించారు. అందుకే వారిని గుర్తుంచుకోవాలి" అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
#WATCH | Speaking in Lok Sabha during discussion on the 75th anniversary of the adoption of the Constitution of India, Defence Minister Rajnath Singh says, " many postcolonial democracies and their constitutions did not last long. but the indian constitution, despite all the… pic.twitter.com/TZKDdTbp2n
— ANI (@ANI) December 13, 2024
'బీజేపీకి ఎక్కువ మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేది'
మరోవైపు, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ మెజార్టీ వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. రాజ్యాంగం న్యాయం, ఐక్యత, భావ ప్రకటనా స్వేచ్ఛకు రక్షణ కవచమని అన్నారు. కానీ గత 10 ఏళ్లుగా ప్రభుత్వం రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా విపక్షాల తరఫున ప్రియాంక గాంధీ తొలుత ప్రసంగించారు. ఈ క్రమంలో బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
#WATCH | In Lok Sabha, Congress MP Priyanka Gandhi Vadra says, " ...our constitution is 'suraksha kavach' (safety armour). such a 'suraksha kavach' that keeps the citizens safe - it is a 'kavach' of justice, of unity, of right to express. it is sad that in 10 years, colleagues of… pic.twitter.com/7o3dVCtEEw
— ANI (@ANI) December 13, 2024
'రాజ్యాంగం అంటే సంఘ్ రూల్ బుక్ కాదు'
శంభల్, మణిపుర్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చలించలేదని ప్రియాంక ఆరోపించారు. రాజ్యాంగం అంటే సంఘ్ (ఆర్ఎస్ఎస్ను ఉద్దేశిస్తూ) రూల్ బుక్ కాదని దుయ్యబట్టారు. రాజ్యాంగం అంటే 'భారత్ కా సంవిధాన్' అని, 'సంఘ్ కా విధాన్' కాదని ఎద్దేవా చేశారు. "ప్రజలు కుల ఆధారిత జనాభా గణనను డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ కులగణనకు పిలుపునిచ్చినప్పుడు వారు గోవులు, మంగళసూత్రం దొంగిలించడం గురించి మాట్లాడారు. రాజ్యాంగం దేశానికి ఐక్యతా సందేశాన్ని ఇచ్చింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ విభజన రాజకీయాలను అనుసరిస్తోంది" అని ప్రియాంక గాంధీ ఆరోపించారు.
#WATCH | Speaking in Lok Sabha during discussion on the 75th anniversary of the adoption of the Constitution of India, SP MP Akhilesh Yadav says, " this constitution is our armour, our security, it provides us strength from time to time. constitution is the true guardian of the… pic.twitter.com/nkHhHHChHc
— ANI (@ANI) December 13, 2024
'బీజేపీ పాలనలో ద్వితీయ శ్రేణి పౌరులుగా మైనార్టీలు'
బీజేపీ పాలనలో దేశంలోని మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే కులగణనను నిర్వహిస్తామని తెలిపారు. కులగణన కులాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి తలసరి ఆదాయంపై ప్రభుత్వం గణాంకాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ సరిహద్దుల్లో చైనా సైన్యాన్ని మోహరించిందని ఆరోపించారు.