ETV Bharat / bharat

'డబ్బుల్లేవ్‌, ఎన్నికల్లో పోటీ చేయలేను'- టికెట్‌ వెనక్కిచ్చేసిన కాంగ్రెస్‌ నాయకురాలు - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Congress Contestant Returned Ticket : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కొత్త కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. సూరత్‌లో ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురి కాగా, ఇందౌర్‌లో ఆ పార్టీ అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని బీజేపీలో చేరారు. పూరీలో ఆ పార్టీ అభ్యర్థి ప్రచారం చేయలేకపోతున్నానంటూ ఇప్పుడు అధిష్ఠానానికి టికెట్‌ తిప్పి పంపారు.

SUCHARITA MOHANTY
SUCHARITA MOHANTY (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 1:52 PM IST

Congress Candidate Returned Ticket : ఒడిశాలో కాంగ్రెస్‌ ఆ పార్టీ అభ్యర్థులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు! ప్రచారానికి డబ్బుల్లేక కొందరు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారు. నిధుల కొరత కారణంగా పోటీ చేయలేనంటూ పూరీ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి సుచరిత మొహంతి అధిష్ఠానానికి లేఖ రాశారు. మాజీ ఎంపీ బ్రజామోహన్‌ మొహంతి కుమార్తె అయిన సుచరిత, ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు మెయిల్‌ పంపారు. పార్టీ ఫండ్‌ ఇవ్వనందున ఆ ప్రభావం పూరీలో తన ప్రచారంపై తీవ్రంగా పడినట్లు పేర్కొన్నారు. సొంత వనరులతోనే ప్రచారం చేసుకోవాలని ఏఐసీసీ ఒడిశా ఇన్‌ఛార్జ్‌ అజోయ్‌కుమార్‌ కరాఖండిగా చెప్పినట్లు సుచిత్ర తెలిపారు.

పాత్రికేయురాలిగా పని చేసిన తాను పదేళ్ల క్రితం కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు సుచరిత మొహంతి చెప్పారు. ఇప్పటివరకు తనవద్ద ఉన్న డబ్బంతా ప్రచారానికి ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు తన వద్ద పైసా కూడా లేదన్నారు. ప్రజల నుంచి విరాళాలు స్వీకరించేందుకు చేసిన ప్రయత్నమూ విఫలమైనట్లు సుచిత్ర పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రచార వ్యయాన్ని కనిష్ఠ స్థాయికి తెచ్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. సొంతంగా నిధులు సమకూర్చుకోలేకపోయినా, పూరీలో తాను ప్రభావవంతమైన ప్రచారం కోసం పార్టీ కేంద్ర నాయకత్వంతో సహా సీనియర్‌ నేతలందర్నీ సంప్రదించినట్లు సుచరిత తెలిపారు.

నిధుల కొరత తనను ఎన్నికలబరి నుంచి తప్పుకునేలా చేస్తోందన్నారు. పార్టీ ఫండ్‌ లేకుండా ప్రచారం కొనసాగించటం అసాధ్యమని, అందుకే పార్టీ టికెట్‌ను తిరిగి ఇస్తున్నట్లు కేసీ వేణుగోపాల్‌కు పంపిన మెయిల్‌లో సుచిత్ర పేర్కొన్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్నా పార్టీకి విధేయురాలిగా ఉంటూ, రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని బలపర్చేందుకు కృషిచేస్తానని సుచరిత మొహంతి తెలిపారు. పూరీలో భారతీయ జనతా పార్టీ తరపున ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర, అధికార బిజూ జనతాదళ్‌ నుంచి ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ అరూప్‌ పట్నాయక్‌ పోటీ చేస్తున్నారు.

పూరీ లోక్‌సభ స్థానానికి ఆరో విడతలో భాగంగా మే 25న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు మే 6 ఆఖరు తేదీ. సుచరిత ఇప్పటివరకు నామినేషన్‌ దాఖలు చేయలేదు. నామినేషన్ల గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న వేళ ఆమె టికెట్‌ వెనక్కి ఇవ్వడంతో పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.