Best Tips To Avoid Bad Smell From Clothes : కాలం ఏదైనా సరే దుస్తుల నుంచి చెమట వాసన రావడం అనేది కామన్. కొందరు ఎన్ని పెర్ఫ్యూమ్లు, డియోలు వాడినా బట్టల నుంచి చెమట స్మెల్ వస్తూనే ఉంటుంది. దాంతో నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. వర్షాకాలంలో మరొక విధమైన ముతక వాసన ఇబ్బంది పెడుతుంది. ఈ దుర్వాసన సమస్య రాకుండా ఉండాలంటే.. కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిమ్మకాయ : ఇది ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే దుస్తుల నుంచి వచ్చే చెడు వాసనలను తిప్పికొట్టడంలోనూ నిమ్మరసం(Lemon) సమర్థవంతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చెమట వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయని చెబుతున్నారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. బట్టలు ఉతికే ముందు బకెట్ వాటర్‌లో కాస్త నిమ్మరసం కలిపి అందులో కాసేపు దుస్తులను నానబెట్టుకోవాలి. ఆపై వాష్ చేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.
2021లో 'జర్నల్ ఆఫ్ టెక్స్‌టైల్ అండ్ అపారెల్' ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. నిమ్మరసం దుస్తుల నుంచి వచ్చే చెమట వాసనను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ ఐ.ఎం. ఖాన్ పాల్గొన్నారు. నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దుస్తువుల నుంచి వచ్చే చెడు వాసనలను తొలగించడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
వాట్ ఆన్ ఐడియా : షర్ట్ మీద చట్నీ- కుర్తామీద కాఫీ - మరక ఎంత మొండిదైనా మటాషే!
వెనిగర్ : దుస్తుల నుంచి వచ్చే చెడు వాసన, చెమట వాసనలను తొలగించడంలో వైట్ వెనిగర్ చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే ఆమ్ల స్వభావం బట్టల దుర్వాసనకు కారణమయ్యే ఫంగస్‌ను తరిమికొట్టడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా ఒక బకెట్ గోరువెచ్చని వాటర్‌లో కొద్దిగా వెనిగర్ వేసి బట్టలను నానబెట్టుకోవాలి. అదే వాషింగ్ మెషిన్లో అయితే.. దుస్తులు వాష్ చేయడానికి ముందుగా డిటర్జెంట్‌లో ఒక కప్పు వెనిగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.
ఎసెన్షియల్ ఆయిల్స్ : లావెండర్, టీ ట్రీ లేదా యూకలిప్టస్ వంటి కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా వానాకాలంలో బట్టల నుంచి వచ్చే చెడు వాసనలను పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తాయంటున్నారు. ఎందుకంటే.. వాటిలో మంచి సువాసను అందించే యాంటీ మైక్రోబయల్ గుణాలుంటాయని చెబుతున్నారు.
ఎక్కువ సేపు నానబెట్టకూడదు : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. ఎక్కువసేపు బట్టలను నానబెట్టడం వల్ల త్వరగా మురికి పోతుందని భావిస్తారు. కానీ, గంటలు గంటలు దుస్తులు నానబెట్టడం మంచి పద్ధతి కాదంటున్నారు. దాని వల్ల కూడా బట్టలు దుర్వాసన వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు. మీరు అంతగా నానబెట్టాలంటే అరగంట లేదా గంటకు మించకుండా చూసుకోవడం మంచిదంటున్నారు. అలాగే వర్షాకాలం దుస్తుల నుంచి చెడు వాసనలు రాకుండా ఉండాలంటే అవి పూర్తిగా ఆరేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
దుస్తులపై మరకలు ఓ పట్టాన పోవడం లేదా ? ఇలా చేస్తే చిటికెలో మాయం!