ETV Bharat / bharat

ఎవరెస్ట్ బేస్ ​క్యాంప్​కు ఆరేళ్ల బాలుడు- దుబాయ్​ నుంచి జర్నీ ఇలా! - Mount Everest Base Camp Trekking - MOUNT EVEREST BASE CAMP TREKKING

Child Climbed Mount Everest : వయసుకు మించిన సాహసం చేశాడో హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన ఆరేళ్ల బాలుడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపుపైకి చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు.

Child Climbed Mount Everest
Child Climbed Mount Everest
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 4:25 PM IST

Child Climbed Mount Everest : హిమాచల్​ ప్రదేశ్​లోని బిలాస్​పుర్​కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. అనేక ప్రతికూల పరిస్థితులను తట్టుకుని కూడా ఆ బాలుడు తల్లిదండ్రులతో కలిసి తన లక్ష్యాన్ని సాధించాడు. ప్రస్తుతం యువన్​ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

బిలాస్‌పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ కొన్నేళ్లుగా తన తల్లిదండ్రులతో కలిసి దుబాయ్​లో ఉంటున్నాడు. యువన్ తండ్రి సుభాశ్ అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. యువన్ మొదటి తరగతి చదువుతున్నాడు. కొన్ని నెలల క్రితం మౌంట్ ఎవరెస్ట్ బేస్​ క్యాంప్​కు చేరుకోవాలన్న కోరికను తన తల్లిదండ్రులతో చెప్పాడు యువన్. ఆ తర్వాత ట్రెక్కింగ్​ కోసం యువన్‌ ఆరు నెలల పాటు విశ్రాంతి లేకుండా కఠిన శిక్షణ తీసుకున్నాడు. స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్, రన్నింగ్‌లో కూడా ప్రావీణ్యం పొందాడు.

6 year-old Yuvan from Himachal Pradesh climb Mount Everest Base Camp.
ఎవరెస్ట్ బేస్​ క్యాంప్​ వద్ద యువన్

"మా ప్రయాణం దుబాయ్ నుంచి ప్రారంభమైంది. మేం మొదట కాఠ్​మాండూ చేరుకున్నాం. అక్కడ నుంచి మా స్నేహితులతో కలిసి లుక్లాకు విమానంలో వెళ్లాం. ఆ తర్వాత గైడ్​ సహాయంతో ఏప్రిల్​ 8వ తేదీన ట్రెక్కింగ్ ప్రారంభించాం. 11 రోజుల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నాం. 8 రోజులు ట్రెక్కింగ్ చేశాం. గైడ్ సలహా మేరకు రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నాం"

- సుభాశ్ చంద్ర, యువన్ తండ్రి

"మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్​కు చేరుకోవడం చాలా కష్టం. అక్కడి ఉష్ణోగ్రతల మధ్య ట్రెక్కింగ్ చేయడం మరింత కష్టం. యువన్ తీసుకున్న శిక్షణ వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ట్రెక్కింగ్ పూర్తి చేశాం" అని సుభాశ్ చంద్ర తెలిపారు. యువన్ ఎవరెస్ట్ బేస్​ క్యాంప్​కు చేరుకున్న తర్వాత హిమాచల్ ​ప్రదేశ్​లోని స్వగ్రామంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. తమ ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి ఎంతో కష్టమైన పనిని సుసాధ్యం చేసినందుకు గర్వపడుతున్నట్లు స్థానికులు తెలిపారు.

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆరేళ్ల బాలుడు- బుడిబుడి అడుగులతో రికార్డ్​!

అతిపిన్న వయసులోనే!
కొన్నినెలల క్రితం, మధ్యప్రదేశ్​లోని భోపాల్​కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి సిద్ధి మిశ్ర అతిపిన్న వయసులోనే ఎవరెస్ట్​ పర్వత బేస్​క్యాంపుపైకి చేరుకుంది. దీంతో కేవలం రెండున్నరేళ్ల వయసులోనే ఎవరెస్ట్​ బేస్​ క్యాంప్​ ఎక్కిన చిన్నారుల్లో ఒకరిగా నిలిచింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.