ETV Bharat / bharat

పోర్న్​ వీడియోలు చూసి చెల్లిపై అన్న రేప్​- ఎవరికైనా చెప్పేస్తుందని హత్య

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 6:03 PM IST

Brother Rapes Sister UP : అశ్లీల వీడియోలను చూసి తన చెల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని జరిగిందీ ఘటన.

Brother Rapes Sister UP
Brother Rapes Sister UP

Brother Rapes Sister UP : ఉత్తర్​ప్రదేశ్​లోని కాస్గంజ్ జిల్లాలో ఓ యువకుడు అశ్లీల వీడియోలను చూసి తన సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఎవరికైనా చెబుతుందనే భయంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీస్​ స్టేషన్​కు తరలించి విచారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాటియాలీ పోలీస్ట్ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. నిందితుడి తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. బాధితురాలి తల్లి ఓ పని మీద తన పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో అన్నాచెల్లెళ్లు మాత్రమే ఉన్నారు. అయితే ఆ రోజు రాత్రి భోజనం చేసి ఒకే గదిలో ఇద్దరూ నిద్రించారు.

ఆ సమయంలో నిందితుడు(19) అశ్లీల వీడియోలను ఫోన్​లో చూశాడు. అనంతరం తన సోదరి(17)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతుందనే భయంతో సోదరి గొంతు నులిమి హత్య చేశాడు. వెంటనే పరారయ్యాడు. బాధితురాలి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి పోలీసులు మొబైల్‌ను స్వాధీనం చేసుకుని అతడిని జ్యుడిషీయల్ కస్టడీకి తరలించారు.

ఉద్యోగం కోసం తండ్రి హత్య
బంగాల్​లోని దుర్గాపుర్​లో ఓ యువకుడు ఉద్యోగం కోసం కన్నతండ్రినే హతమార్చాడు. మరో మూడు నెలల్లో బాధితుడు పదవీ విరమణ చెందాల్సి ఉండగా, కుమారుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని ఎటియాది మియాగా గుర్తించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఆండాళ్‌లోని శ్యాంసుందర్‌పుర్‌లో ఎటియాది మియా(59) నివాసం ఉంటున్నారు. ఆయన ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మరో మూడు నెలల్లో రిటైర్ అవ్వనున్నారు. అయితే గత నెలలో మియా షాపింగ్ కోసం మార్కెట్​కు వెళ్లారు. కానీ తిరిగి రాలేదు. దీంతో ఆయన కోసం కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. జనవరి 23వ తేదీన స్థానికంగా ఉన్న అడవుల్లో అతడి మృతదేహం లభ్యమైంది.

మియా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అనుమానంతో మియా కుమారుడు అబ్దుల్ హకీమ్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు హకీమ్​. తన తండ్రిని గొంతు హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే పదవీ విరమణకు ముందే తండ్రి చనిపోతే ఆ ఉద్యోగం కుమారుడికి వస్తుంది. దీంతో ఆ అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు అబ్దుల్ హకీమ్‌ తన తండ్రిని చంపేసినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.