ETV Bharat / bharat

పోర్న్ వీడియోస్ చూసి సొంత చెల్లిపై రేప్​- ఆపై గొంతు నులిమి హత్య- తల్లి కళ్ల ముందే జరిగినా! - Sister Molested And Murder - SISTER MOLESTED AND MURDER

Sister Molested And Murder : పోర్న్ వీడియోలకు అలవాటుపడిన 13 ఏళ్ల బాలుడు సొంత చెల్లెలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన తల్లి ముందే గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతడి నేరాన్ని కప్పి పుచ్చేందుకు తల్లి, అక్కాచెల్లెళ్లు సహకారాన్ని అందించారు. మూడు నెలల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసును పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

Sister Molested And Murder
Sister Molested And Murder (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 7:26 PM IST

Sister Molested And Murder : మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోర్న్ వీడియోలు చూడడంలో అలవాటుపడిన 13 ఏళ్ల బాలుడు, తొమ్మిదేళ్ల సొంత చెల్లెలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చెల్లెలిని తన తల్లి ఎదుటే గొంతు నులిమి హత్య చేశాడు. జరిగిన ఘోరం గురించి కుమారుడని దండించకపోగా తిరిగి సహకరించింది. బాధితురాలి మృతదేహాన్ని మరో కుమార్తెతో కలిసి ఇంటిబయట పడేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మూడు నెలల క్రితం (ఏప్రిల్ 23న రాత్రి) జరిగిన ఈ ఘటనలో బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన వాంగ్మూలంపై పోలీసులకు సందేహం వచ్చింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. బాలుడిని రక్షించేందుకు స్వయంగా తల్లి, ఇద్దరు అక్కాచెల్లెళ్లు(18 ఏళ్లు, 17 ఏళ్లు) యత్నించారు. దీంతో వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిద్రిస్తుండగా!
ఈ కేసు వివరాలను తాజాగా రేవా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 23న రాత్రి సదరు బాలుడు ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూశాడు. అనంతరం ఇంట్లో తన పక్కనే నిద్రపోయిన చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. జరిగిన ఘోరం గురించి తండ్రికి చెబుతానని బాలిక అనడం వల్ల గొంతును బలంగా నులిమాడు. అక్కడే తల్లి కూడా ఉంది. అప్పటికే బాలిక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో మరోసారి గొంతు నులిమి బాలికను కడతేర్చాడు.

అదే సమయంలో నిద్ర నుంచి మేల్కొన్న ఆ బాలుడి మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు పడక గది మొత్తం సర్దేశారు. పోలీసులను పక్కదోవ పట్టించేందుకు తాము నిద్రపోయిన ప్రదేశాన్ని మార్చారు. ఇంటి ప్రాంగణంలో తమ కుమార్తె మృతదేహం పడి ఉందంటూ ఏప్రిల్ 24న ఉదయం పోలీసులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు. సినీ ఫక్కీలో నటించడం ద్వారా చేసిన నేరం నుంచి తప్పించుకోవాలని భావించారు. దర్యాప్తు సమయంలో ఆధారాలు సేకరించి 50 మందిని విచారించిన పోలీసులు, ఆ కుటుంబ సభ్యుల వాంగ్మూలాల్లో పదేపదే మార్పులు ఉండటాన్ని గుర్తించారు. వాటి ఆధారంగానే అసలు విషయాన్ని తెలుసుకోగలిగారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.