Maharashtra CM Oath Taking Ceremony : మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా ప్రమాణం చేయడం ఇది మూడోసారి కావడం విశేషం. అనంతరం శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ శిందే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ముంబయి ఆజాద్ మైదాన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలతోపాటు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
మోదీ శుభాకాంక్షలు
నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఫడణవీస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్‌ను ప్రధాని అభినందించారు.
PM Narendra Modi congratulates Devendra Fadnavis on taking oath as Maharashtra CM pic.twitter.com/lZuF1uUdjm
— ANI (@ANI) December 5, 2024
బాధ్యత పెరిగింది
దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆయన భార్య అమృత ఫడణవీస్ మీడియాతో మాట్లాడారు. సీఎంగా ఆయనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. 'ఫడణవీస్ ఆరోసారి ఎమ్మెల్యే అయ్యారు. మూడోసారి సీఎం కానున్నారు ఈ విషయంలో ఆనందం కన్నా, ఆయనపై పెద్ద బాధ్యత ఉందనే భావన కలుగుతోంది' అని అమృత పేర్కొన్నారు.
VIDEO | BJP leader Devendra Fadnavis (@Dev_Fadnavis) takes oath as Maharashtra CM at Azad Maidan in Mumbai. pic.twitter.com/qzGrZ4RKWW
— Press Trust of India (@PTI_News) December 5, 2024
కాగా, ఫడణవీస్ 2014లో తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2014 నుంచి 2019 వరకు సీఎంగా వ్యవహరించారు. ఇక 2019లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ- అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా 3 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా ఆయన మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
భారీ విజయం
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం దక్కించుకుంది. 288 అసెంబ్లీ స్థానాలకుగానూ మహాయుతి కూటమి మొత్తంగా 230 సీట్లు సొంతం చేసుకుంది. అందులో బీజేబీ 132 స్థానాల్లో విజయం సాధించగా, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు గెలుపొందాయి.
కార్పొరేటర్ టూ సీఎం- అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఫడణవీస్
పట్టువీడిన శిందే? డిప్యూటీ పోస్ట్‌కు ఓకే! 'మహా' సీఎంగా ఫడణవీస్!!