ETV Bharat / bharat

సమ్మర్​లో ఫ్యామిలీతో కలిసి ట్రిప్​ ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఈ టాప్-10 ప్లేసెస్‌పై ఓ లుక్కేయండి! - Tourist Places in India for Summer

Tourist Places in India : మీరు సమ్మర్‌లో పిల్లలతో కలిసి ట్రిప్‌కు వెళ్లాలని ప్లాన్​ చేస్తున్నారా? కొన్ని రోజులు టెన్షన్స్​ అన్నీ పక్కకు పెట్టి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! దేశంలో బెస్ట్​ టూరిస్ట్​ ప్లేసెస్​ లిస్ట్​ పట్టుకొచ్చాం. మరి లేట్​ చేయకుండా ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

Best Family Friends Summer Vacation In India

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 2:48 PM IST

Tourist Places in India for Summer: సమ్మర్​ హాలీడేస్​ మరికొన్ని రోజుల్లో రాబోతున్నాయి. సంవత్సరం పాటు పుస్తకాలకు అతుక్కుపోయిన పిల్లలు.. ఫ్రీ బర్డ్స్​ కానున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది పేరెంట్స్​ ఈ వేసవి సెలవుల్లో తమ పిల్లలతో కలిసి ఎంజాయ్​ చేయాలని ట్రిప్​ ప్లాన్​ చేసుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్‌ చేయాలని భావిస్తారు. మరి, మీరు కూడా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఏదైనా ట్రిప్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా ? కానీ, ఎక్కడికి వెళ్లాలి ? ఏ ప్రదేశాలు చూడాలి అని ఆలోచిస్తున్నారా ? అయితే టెన్షన్​ అక్కర్లేదు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల జాబితాను మీకోసం తీసుకొచ్చాం. మరి దానిపై ఓ లుక్కేయండి..

జైపూర్, రాజస్థాన్ : రాజస్థాన్‌ రాజాధాని జైపూర్‌ను 'పింక్ సిటీ' అని కూడా అంటారు. ఇక్కడ చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 'హవా మహాల్‌'. ఇది 953 చిన్న కిటికీలతో నిర్మించిన ఐదు అంతస్తుల భవనం. అలాగే ఈ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కోటలలో 'అమెర్‌ ఫోర్ట్‌(దీనినే అంబర్​ ఫోర్ట్​ అని కూడా పిలుస్తారు), జై ఘర్, నహర్ ఘర్' ఉన్నాయి. ఇవి పర్యాటకులను కట్టి పడేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే పిల్లలతో కలిసి స్థానికంగా ఉండే మార్కెట్‌లో షాపింగ్‌ కూడా చేయవచ్చు.

గోవా : ఏడాది పొడవున పర్యాటకులతో కిటికిటలాడే ప్రాంతం గోవా. ఇక సమ్మర్‌లో అయితే, పర్యాటకుల సందడి మామూలుగా ఉండదు. ఇక్కడికి మీరు పిల్లలు, స్నేహితులతో కలిసి వెళ్తే ఎంచక్కా ఎంజాయ్​ చేయవచ్చు. స్విమ్​ కూడా చేయొచ్చు. అలాగే సముద్రంలో పారాసైలింగ్ వంటివి కూడా చేసి ఫుల్‌గా ఎంజాయ్‌ చేయొచ్చు. ఇంకా ఇక్కడ షాపింగ్‌ చేయడానికి చాలా మాల్స్, మార్కెట్స్‌ ఉంటాయి. అలాగే సీ ఫుడ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు.

సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ : హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు వేసవి కాలంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి అందమైన కొండలు, చారిత్రక భవనాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. సిమ్లాలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు 'రిడ్జ్‌, మాల్‌రోడ్‌, జాఖూ పిల్‌' ఉన్నాయి. అలాగే హిమచల్‌ ప్రదేశ్‌ చరిత్ర, సంస్కృతిని తెలియజేసే 'రాష్ట్ర మ్యూజియాన్ని' కూడా చూడాల్సిన ప్లేసెస్​లో ఒకటి. మీరు ఎక్కువగా షాపింగ్‌ను ఇష్టపడితే ఇక్కడ దుస్తులు, నగలు, హస్తకళలు వంటివి ఎన్నో కొనవచ్చు.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్ : మీ పిల్లలు జంతువులు, వన్యప్రాణులను చూడటానికి ఇష్టపడితే వారిని ఈసారి ఉత్తరాఖండ్​లోని నైనిటాల్ జిల్లాలో ఉన్న 'జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌కు' తీసుకు వెళ్లండి. అక్కడ పులులు, ఏనుగులు, జింకలు వంటి వివిధ రకాల జంతువులను చూడవచ్చు. అలాగే వివిధ రకాల పక్షులను చూసి ఎంతో ఎంజాయ్‌ చేయవచ్చు.

అండమాన్, నికోబార్ దీవులు : బంగాళాఖాతంలో ఉండే అండమాన్‌, నికోబార్‌ దీవులు బీచ్‌లకు పెట్టింది పేరు. ఇక్కడ ఉండే బీచ్‌లు దాదాపు అన్నీ కూడా స్వచ్ఛమైన నీటితో ఉంటాయి. మీరు ఈ హాలీడేస్‌లో ఇక్కడికి వెళ్లాలనుకుంటే, కచ్చితంగా అక్కడ ఉండే 'హావ్లాక్ ఐలాండ్‌, నీల్ ఐలాండ్‌, రాధానగర్ బీచ్, వండర్ బీచ్, సెల్యులార్ జైలు' వంటి వాటిని చూడాలి. అలాగే ఇక్కడ మీరు సముద్రంలో స్కార్కెలింగ్‌, స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు.

Best Hill stations in Telangana and Andhrapradesh : తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్ట్​ స్పాట్లు.. ఒక్కసారైనా చూసి తీరాల్సిందే!

ఊటీ, తమిళనాడు : ఊటీని 'క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉండే కొండలు.. ప్రకృతి ప్రేమికుల్ని అందాలతో కట్టిపడేస్తాయి. మీరు ఈ సమ్మర్‌లో ఇక్కడికి వెళ్తే 'బొటానికల్ గార్డెన్‌, డోడాబెట్ట శిఖరం, ఊటీ రోజ్ గార్డెన్' వంటి వాటిని చూసి ఎంజాయ్‌ చేయొచ్చు. ఊటీలో మొత్తం తేయాకు తోటలు, ప్రసిద్ధ నీలగిరి పర్వతాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

రణతంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్ : రాజస్థాన్​లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో మీరు ఎన్నో రకాల వన్యప్రాణులను చూడవచ్చు. ఇది దేశంలోనే ప్రసిద్ధి చెందిన టైగర్‌ రిజర్వ్‌లలో ఒకటిగా చెబుతారు. ఇక్కడ బెంగాల్‌ పులులు, చిరుతపులులు, ఏనుగులు, జింకలు ఉంటాయి. అలాగే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి జీప్‌ సఫారీ చేస్తూ ఈ జంతువులన్నింటినీ దగ్గరి నుంచి చూడవచ్చు.

మహాబలేశ్వర్, మహారాష్ట్ర : మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న మహాబలేశ్వర్ ఒక హిల్ స్టేషన్. ఇక్కడ మీరు వెన్నా లేక్‌లో పడవ ప్రయాణం చేస్తే ప్రకృతిని చూసి మైమరిచిపోవాల్సిందే. అలాగే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ నిర్మించిన 'ప్రతాప్‌గఢ్‌ కోట'ను కూడా చూడవచ్చు. ఇంకా ఇక్కడ చూడాల్సిన పురాతన దేవాలయాలు, కోటలు ఎన్నో ఉన్నాయి.

నైనిటాల్, ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో ఉన్న 'నైనిటాల్' ఒక హిల్ స్టేషన్. ఇది హిమాలయాలలో 1,938 మీటర్ల (6,358 అడుగుల) ఎత్తులో ఉంది. ఇక్కడికి మీరు ఈ సమ్మర్‌లో ట్రిప్‌కు వస్తే చల్లటి వాతావరణం, దట్టమైన ఆడవులను చూసి ఫుల్‌గా ఎంజాయ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు 'నైనిటాల్ సరస్సు, టిఫిన్ టాప్, నైనా దేవి దేవాలయం, మల్లిటాల్' వంటివి ఉన్నాయి.

కొడైకెనాల్, తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలోని కొడైకెనాల్‌ ఒక హిల్ స్టేషన్‌. వేసవి కాలంలో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లే ప్రదేశాలలో ఇది ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక్కడికి పిల్లలతో కలిసి వెళ్తే కొడైకెనాల్ సరస్సులో బోటింగ్ చేస్తూ ఆనందించవచ్చు. అలాగే 'బ్రయంట్‌ పార్క్‌, కోకర్స్‌ వాక్‌, పిల్లర్ రాక్స్' వంటి ప్లేస్‌లను చూసి హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు.

వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? - హైదరాబాద్​లోని టాప్ 10 చారిత్రక ప్రదేశాలపై ఓ లుక్కేయండి!

నవంబర్‌లో నార్త్​ ఇండియా టూర్‌ ఈ ప్రదేశాలను అస్సలు మిస్‌ చేయకండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.