ETV Bharat / bharat

'బీజేపీలో నెలరోజుల్లోగా చేరకపోతే అరెస్ట్!'- ఆతిశీకి లీగల్ నోటీసులు- ఆప్​ నేతల నిరసన! - Atishi Gets Defamation notice

Atishi Vs BJP : దిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి. బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులో కీలకమైన మంత్రి ఆతిశీ ఇటీవల చేసిన ఆరోపణలపై కమలదళం భగ్గుమంది. ఆమెకు పరువు నష్టం దావా నోటీసులను పంపింది. 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని, చేసిన ఆరోపణలకు ఆధారాలను చూపాలని దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ డిమాండ్ చేశారు.

Atishi Gets Defamation notice
Atishi Gets Defamation notice
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 12:44 PM IST

Updated : Apr 3, 2024, 12:57 PM IST

Atishi Vs BJP : ఓ వైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, మరోవైపు దిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. దిల్లీ మంత్రి, ఆప్​ నాయకురాలు ఆతిశీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. 'బీజేపీలో చేరాలనే ఆఫర్ నాకు కొందరి ద్వారా వచ్చింది. ఒకవేళ చేరకుంటే నెల రోజుల్లోగా నాతో పాటు దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌లను ఈడీతో అరెస్టు చేయిస్తామనే వార్నింగ్ కూడా బీజేపీ నుంచి అందింది' అని ఆతిశీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయింది. ఈ విషయంపై దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్​దేవ్ ఆధారాలు చూపాలని ఆతిశీకి పరువు నష్టం నోటీసులు పంపించారు.

ఆతిశీ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ అన్నారు. 'ఆతిశీకి బీజేపీ ఎలాంటి ఆఫర్లు ఇవ్వలేదు. ఆతిశీ అబద్ధాలు చెప్పి పారిపోతానంటే కుదరదు. ఆమెకు ఇప్పటికే పరువు నష్టం దావా నోటీసులు ఇచ్చాం. వాటికి 15 రోజుల్లోగా ఆతిశీ సమాధానం చెప్పాల్సి ఉంది. ఒకవేళ నోటీసులకు ఆతిశీ సకాలంలో సమాధానం చెప్పకుంటే బీజేపీ తరఫున సివిల్ పరువు నష్టం దావా, క్రిమినల్ పరువు నష్టం దావా చర్యలను తీసుకుంటాం. బీజేపీ ఎలా ఆఫర్ ఇచ్చిందనే దానిపై తగిన ఆధారాలను చూపించాల్సిన బాధ్యత ఆమెపైనే ఉంది' అని వీరేంద్ర తెలిపారు.

'దేవుడు కూడా బీజేపీని క్షమించడు'
సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై దిల్లీ మంత్రి ఆతిశీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఎక్స్​ వేదిక ఒక పోస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే యావత్ దేశం, దేవుడు కూడా బీజేపీని క్షమించడని ఆమె పేర్కొన్నారు. ''అరవింద్ కేజ్రీవాల్‌కు తీవ్రమైన డయాబెటిక్ ఉంది. ఆరోగ్య సమస్యలున్నా ఆయన రోజూ 24 గంటలు దేశ సేవ చేసేవారు. అరెస్టు చేసినప్పటి నుంచి కేజ్రీవాల్ బరువు నాలుగున్నర కిలోలు తగ్గింది. కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచి ఆయన ఆరోగ్యంతో బీజేపీ చెలగాటమాడుతోంది'' అని ఆమె ఆరోపించారు. కాగా, మంగళవారం ఉదయం కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్ కొంతమేర తగ్గింది. ఆయన షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు గురవుతున్న విషయం వాస్తవమేనని, ఆయనను తీహార్ జైలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని జైలు అధికారులు వెల్లడించారు.

7న జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఏప్రిల్ 7న జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయనున్నారు. ఈవిషయాన్ని ఆప్ సీనియర్ నేత, దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం వెల్లడించారు. దిల్లీ మంత్రులు, ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, వ్యాపారులు కూడా పాల్గొంటారన్నారు. ఆప్‌ను అంతం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ అగ్ర నాయకత్వాన్ని బీజేపీ అరెస్టు చేయించిందని రాయ్ పేర్కొన్నారు.

టైలర్​ షాప్​లో ఘోర అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి - Maharashtra Fire Accident

రాజకీయాలకు సీఎం గుడ్​బై- వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన - CM Siddaramaiah Retirement

Last Updated : Apr 3, 2024, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.