నడిరోడ్డుపై కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారం వల్లే! - కలబురగి వార్తలు
యువకుడిని వెంబడించి కత్తులతో అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని కలబురగిలో వెలుగు చూసింది. ఈ ఘటన మొత్తం స్థానికంగా ఉన్న సీసీటీవీల్లో రికార్డైంది. కలబురగిలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన జమీర్ (23).. ఆదివారం బైక్‌పై బయటకు వెళ్తుండగా ఇద్దరు దుండగులు కత్తులతో పలుమార్లు పొడిచి చంపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అయితే జమీర్ హత్య వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అంటున్నారు. ఆర్థిక తగాదాల కారణంగా జమీర్‌ను అతడి స్నేహితులే హత్య చేసి ఉంటారని మరికొందరు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కలబురగి పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.