తెలంగాణ

telangana

ETV Bharat / videos

కదులుతున్న రైలులో చోరీకి యత్నం.. 15 కి.మీ. వేలాడుతూనే.. - కదులుతున్న రైలులో చోరీకి యత్నం

By

Published : Sep 15, 2022, 10:58 PM IST

కదులుతున్న రైల్లో నుంచి ఫోన్​ దొంగతనానికి యత్నించి దొరికిపోయాడు ఓ వ్యక్తి. బిహార్​లోని ఖగారియా స్టేషన్​ వద్ద కదులుతున్న రైలు కిటికీలో నుంచి ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన ప్రయాణికుడు దొంగ మరో చేయిని పట్టుకున్నాడు. 15 కిలోమీటర్ల దూరం పాటు రైలుకు వేలాడుతూనే ప్రయాణించాడు. తనను వదిలిపెట్టాలంటూ దొంగ ప్రాధేయపడినా పట్టించుకోకుండా తర్వాత స్టేషన్​ వచ్చేవరకు పట్టుకున్నారు. సాహెబ్​పుర్​ చేరుకున్న అనంతరం పోలీసులకు అప్పగించారు. దీనిని ఓ ప్రయాణికుడు వీడియో తీయగా.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దొంగను సాహెబ్​పుర్​కు చెందిన పంకజ్​ సింగ్​గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details