ప్రతిధ్వని: మోయలేని భారంగా డీజిల్, పెట్రోల్ ధరలు - Telangana news
పెట్రో వాతలు ఆగేదెప్పుడూ? ఎలా? సగటు భారతీయుడి ప్రశ్న ఇదే ఇప్పుడు. బండి తీయాలంటేనే భయం వేస్తోంది. పెట్రోల్ బంకులవైపు వెళ్లాలంటేనే గుండె బరువెక్కుతోంది. పైసలు పైసలుగా వందకు చేరువవుతూ... మోయలేని భారంగా మారాయి పెట్రోల్ ధరలు. ఆ వెనుకే పెరుగుతున్న డీజీల్ ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెరగడం తప్ప తగ్గడం అనే మాట వినిపించడం లేదు. ఈ చమురు మంటల్లో మాడిపోతున్న ప్రజలకు ఒకే ఒక్క ఊరటగా కనిపించే అంశం చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడం. అలా చేస్తే పన్ను పోటు తప్పి చమురు ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయని ఎంతో మంది బల్ల గుద్ది మరి చెబుతున్నారు. మరి ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదు. ఇకనైనా ఆ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందా. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ.