నదిలో కొట్టుకుపోయిన పులి.. బ్యారేజీ వద్ద చిక్కుకొని... - tiger trapped in ghaghara river
ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ఖేరీ ప్రాంతంలోని కర్తానియాఘాట్ టైగర్ రిజర్వ్ దగ్గర వరద ధాటికి ఓ పులి కొట్టుకుపోయింది. గిరిజపురి బ్యారేజీ వద్ద ఘగ్రా నది ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల పులి చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు స్థానికుల సాయంతో పులిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.