Pratidhwani: భార్య-భర్త ఇద్దరి మధ్య లైంగిక జీవనంలో చట్టాల పాత్ర ఎంత? - Pratidhwani debate news
Pratidhwani: వైవాహిక అత్యాచారం విషయంలో విదేశీ చట్టాలను గుడ్డిగా అనుకరించడం సరికాదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైవిధ్యమైన సంస్కృతీ, సంప్రదాయాలున్న భారతదేశంలో భార్య-భర్త మధ్య నెలకొనే లైంగిక వివాదాల నిర్ధరణ విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అభిప్రాయపడింది. విస్తృత ఏకాభిప్రాయం తర్వాతనే వైవాహిక అత్యాచారంపై మెరుగైన అవగాహన సాధ్యమవుతుందని కేంద్రం ప్రకటించింది. ఈ దిశగా క్రిమినల్ చట్టానికి సమగ్ర సవరణలపై అభిప్రాయాలు, సూచనలు కోరుతోంది. ఈ నేపథ్యంలో వైవాహిక అత్యాచారంపై కేంద్ర ప్రభుత్వం అనుసరించనున్న నిర్మాణాత్మక విధానం ఏంటి? ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం వైవాహిక అత్యాచారంలో భర్తకు లభిస్తున్న మినహాయింపు ఏంటి? పెళ్లైన మహిళకు తన భర్తతో ఇష్టంలేని లైంగిక చర్యను నిరాకరించే హక్కు ఉందా? లేదా? ఇంతకూ ఏది వైవాహిక అత్యాచారం? ఏది కాదు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.