Pratidwani: రెండో డోసు తీసుకున్నా లక్షణాలుంటే గుంపులో తిరగొచ్చా? - Telangana news
కరోనా జాగ్రత్తలపై ప్రజల్లో ఆసక్తి తగ్గింది. మాస్క్, భౌతికదూరం, సానిటైజేషన్ విషయాల్లో నిర్లక్ష్యం పెరిగింది. మరోవైపు పండుగల సీజన్ మొదలవడంతో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా షాపింగ్, వేడుకల్లో జనం గుంపులు గుంపులుగా తిరుగుతున్న పరిస్థితి. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే సెకండ్ వేవ్‌లో దేశం భారీమూల్యం చెల్లించింది. అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో మూడో వేవ్ ముప్పు ఉండొచ్చని గతంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పండుగల సమయంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తపై ఈరోజు ప్రతిధ్వని చర్చను చేపట్టింది.