తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDHWANI: స్మార్ట్‌ ఫోన్‌లో యూజర్ల వ్యక్తిగత సమాచారానికి ప్రైవసీ ఎంత? - స్మార్ట్‌ ఫోన్‌ సెక్యూరిటి ఎంత

By

Published : Jun 4, 2022, 10:14 PM IST

PRATHIDHWANI: ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేస్తోంది స్మార్ట్‌ ఫోన్‌. మన అవసరాలు, అభిరుచుల సమాచారం కోసం వెబ్‌ సైట్స్‌, యాప్స్‌లో వెతకడం సర్వసాధారణమైంది. ఇలాంటి సమయంలోనే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో పనిచేస్తున్న ఆడియో, వీడియో యాప్స్‌.. యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఇష్టాఇష్టాల ఆధారంగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. తలచిందే తడవుగా దానికి సంబంధించిన యాడ్స్‌ ప్రత్యక్షం అవుతుండటం చూసి ఆశ్చర్చపోవడం వినియోగదారుల వంతు అవుతోంది. అసలు స్మార్ట్‌ ఫోన్‌లో యూజర్ల వ్యక్తిగత సమాచారం... వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా యాప్‌లకు ఎలా చేరుతోంది? ఈ ఫోన్ల ‌మెమొరీల్లో, క్లౌడ్లలో నిల్వ చేసుకుంటున్న డేటా సురక్షితంగా ఉంటోందా? అసలు స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకున్న ప్రైవసీ ఎంత? ఇదే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.

ABOUT THE AUTHOR

...view details