Prathidwani: రుణాలు పొందేందుకు రైతులు అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటి? - Prathidwani News
Prathidwani: ప్రైవేటు అప్పుల ఊబి నుంచి బయట పడేందుకు రైతులకు డెబిట్ స్వాపింగ్ లోన్లు ఇవ్వాలని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి వివిధ బ్యాంకులకు ఏటా లక్ష్యాలు కూడా నిర్దేశిస్తోంది. కానీ... బ్యాంకులు మాత్రం ఈ లక్ష్యం వైపు నత్తనడకన సాగుతున్నాయి. రైతులు పాతబాకీలు తీర్చకపోయినా సరే... ఏ పూచీకత్తు లేకుండానే డెబిట్ స్వాపింగ్ లోన్లు పొందవచ్చన్న విషయం చాలామంది రైతులకు తెలియదు. రైతాంగంలో అవగాహనలేమిని అడ్డు పెట్టుకుని బ్యాంకులు డీఎస్‌ఎల్ మంజూరులో తీవ్ర అలక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. దీంతో అప్పుల ఊబిలో నుంచి బయట పడలేక రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అసలు డీఎస్‌ఎల్ ఎవరికి వర్తిస్తుంది? ఈ రుణాలు పొందేందుకు రైతులు అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటి? డీఎస్‌ఎల్ విషయంలో బ్యాంకర్లపై ఉన్న బాధ్యత ఏంటి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.