రూపాయికే లీటర్ పెట్రోల్.. ఎగబడ్డ జనం.. ఎక్కడంటే? - cheap petrol price in india today
రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో.. వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు పోటెత్తారు. మహారాష్ట్ర సోలాపుర్‌లోని ఓ పెట్రోల్ బంక్ యాజమాన్యం.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. గురువారం 500 మందికి ఒక్కొక్కరికి లీటర్ చొప్పున పెట్రోల్ ఇచ్చింది. భారీ సంఖ్యలో వచ్చిన వాహనదారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సామాన్యులకు పెను భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు బంక్ యాజమాన్యం తెలిపింది.