ఎంబీసీ సీజన్-4 పోస్టర్ రిలీజ్.. వేడుకలో సందడి చేసిన మోడల్స్ - somajiguda hyderabad
హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో ముల్తాయ్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్వహించే ఎంబీసీ సీజన్-4 పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సామాజిక వేత్త సుధాజైన్, సినీ నటి నజియాఖాన్, పలువురు మోడల్స్, ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో మోడల్స్ నిర్వహించిన ఫ్యాషన్ షో పలువురిని ఆకట్టుకుంది. మేకప్, ఫ్యాషన్, బ్యూటీ రంగాల్లో రాణించాలనుకునే యువతరానికి అవకాశాలు కల్పించడానికి ఈ పోటీలు నిర్వహిస్తారు.