మద్యం మత్తులో 60 అడుగుల టవర్ పైనుంచి పడిన యువకుడు - ఖర్గోన్ వైరల్ వీడియో
మద్యం మత్తులో ఓ యువకుడు 60 అడుగుల ఎత్తున్న ఎలక్ట్రిక్ టవర్ పైనుంచి జారిపడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఖర్గోన్లోని ఊన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పింటు అనే వ్యక్తి టవర్ ఎక్కాడని స్థానికులు.. పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పింటును కిందకు రప్పించేందుకు ప్రయత్నించారు. అంతలోనే అతడు కాలు జారి కింద పడిపోగా.. తీవ్ర గాయాలయ్యయాయి. పోలీసులు వెంటనే బాధితుడ్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.