ఈటీవీ 25వ వార్షికోత్సవం.... పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు - ఈటీవీ 25వ వార్షికోత్సవం
ఈటీవీ 25వ వార్షికోత్సవం సందర్భంగా జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాదిన తొలి శాటిలైట్ ఛానల్ ఈటీవీ 25 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. సిల్వల్‌జూబ్లీలోకి అడుగుపెట్టిన ఈటీవీకి తన శుభాభినందనలు తెలిపారు. నంది అవార్డులతో పాటు అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను ఈటీవీ అందుకుందన్న పవన్‌కల్యాణ్.. ఈటీవీ గోల్డెన్‌జూబ్లీతో పాటు మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని కోరుకున్నారు. రామోజీరావు ఈటీవీ సిబ్బందికి తన ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు పవన్‌కల్యాణ్.