స్ట్రెచర్‌పై పడుకునే ఎగ్జామ్ రాసిన విద్యార్థి- ఏం డెడికేషన్ గురూ! - tamilnadu news
తీవ్రంగా గాయపడి, మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్నా... స్ట్రెచర్‌పై పడుకునే పరీక్ష రాసి అందరితో శెభాష్ అనిపించుకున్నాడు ఓ విద్యార్థి. తమిళనాడు తిరునెల్వేలిలోని పెట్టైలో మంగళవారం జరిగిందీ ఘటన. ప్లస్2 చదువుతున్న అజారుద్దీన్.. ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. పాళయంకొట్టై ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేసి, కాలుకు పెద్ద కట్టు కట్టారు. కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే.. పరీక్షలు మానడం ఏమాత్రం ఇష్టం లేని అజారుద్దీన్.. అంబులెన్స్‌లోనే పరీక్ష కేంద్రానికి వచ్చాడు. అక్కడి ఉపాధ్యాయులకు విషయం చెప్పి.. స్ట్రెచర్‌పై పడుకునే మ్యాథ్స్ ఎగ్జామ్ రాశాడు.